శంకర్ సినిమాల్లో గ్రాండియారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. తొలి నుంచి విజువల్ రిచ్ కంటెంట్ తో మెరిపించడం అతడికే చెల్లింది. పాటలు సహా భారీ యాక్షన్ సీన్స్ కి శంకర్ డిజైన్ చేసే ఒక్కో కాన్సెప్ట్ ఒక్కో మాష్టర్ పీస్ గా అలరించాయి. ఇటీవలే 2.ఓ చిత్రంలో భారీ సెట్స్ తో విజువల్ రిచ్ లుక్ అప్పియరెన్స్ తో మైమరిపించారు. ప్రస్తుతం అలాంటి ఫీట్ నే `భారతీయుడు 2` చిత్రంలోనూ రిపీట్ చేయబోతున్నాడని తెలుస్తోంది.
ఈ సినిమాలో ఓ సీన్ ఎంతో స్పెషల్ గా ఉంటుందట. ఆ సన్నివేశం ఆద్యంతం బంగారు వర్ణం బ్యాక్ గ్రౌండ్ తో అలరిస్తుందట. ఎటు చూసినా బంగారు గనిలో ప్రవేశించామా? అన్నట్టు ఉండే బంగారు బిస్కెట్ సెట్ ని డిజైన్ చేసి అందులో ఓ సీన్ ని అద్భుతంగా చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే అందుకు సంబంధించిన సెట్ ని డిజైన్ పూర్తయిందని తెలుస్తోంది.
`భారతీయుడు 2` చిత్రాన్ని ఇటీవలే తైవాన్ లో ప్రారంభించిన సంగతి విదితమే. ఈ సినిమాని థాయ్ ల్యాండ్ - బ్యాంకాక్ లోని అరుదైన లొకేషన్లు సహా - రామోజీ ఫిలింసిటీ - కడప వంటి చోట్ల తెరకెక్కించనున్నారు. తాజాగా బంగారు వర్ణం సెట్ ని డిజైన్ చేశారు. ఇందులో రెండే రెండు నిమిషాల పాటు సాగే సన్నివేశాన్ని తెరకెక్కించాల్సి ఉందని తెలుస్తోంది. ఆ సీన్‌ని రెండు రోజుల్లోనే పూర్తి చేస్తారట. అందుకోసం ఏకంగా 2- 2.5 కోట్ల మేర ఖర్చు చేస్తున్నారని యూనిట్ సభ్యుల సమాచారం. రెగ్యులర్ చిత్రీకరణకు సంబంధించిన అప్ డేట్ తొందర్లోనే తెలుస్తుందట. ఇప్పటికే కమల్ హాసన్ భారతీయుడి గెటప్ లుక్ టెస్ట్ పూర్తయింది. సేనాపతి లుక్ లో వేరియేషన్స్ ని ట్రై చేస్తున్నారని సమాచారం. చందమామ కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో తెలుగు - తమిళ్ - హిందీ స్టార్లు నటిస్తున్నారు. వెన్నెల కిషోర్ జాక్ పాట్ పట్టేసిన సంగతి తెలిసిందే.