మొదటి నుంచి కూడా గోపీచంద్ తన పనేదో తాను చేసుకుపోతుంటాడు. ఎక్కువగా బయట ఫంక్షన్స్ లో కనిపించడు. అలాంటి గోపీచంద్ ఇప్పుడిప్పుడే ఫంక్షన్స్ లో మెరుస్తున్నాడు. సంతోష్ శోభన్ - మెహ్రీన్ జంటగా నటించిన 'మంచి రోజులు వచ్చాయి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ .. "ఈ సినిమాకి టైటిల్ దగ్గర నుంచి ప్రతిదానికి పాజిటివ్ వైబ్ ఉంది. ఆ పాజిటివ్ వైబ్ ఈ సినిమాను హిట్ దిశగా తీసుకువెళుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను.
ముందుగా సంతోష్ గురించి మాట్లాడతాను .. మీ ఫాదర్ తో నేను వర్క్ చేశాను .. 'వర్షం' సినిమా కోసం. నేను .. ప్రభాస్ గారు .. మీ ఫాదర్ చాలా రోజుల పాటు సెట్లో కలిసి పనిచేశాము. ఆయన చాలా మంచి పర్సన్ .. చాలా బాగా తీశారు .. మాకు ఒక మంచి బ్రేక్ ఇచ్చారు. ఇందాక నువ్వు ఒక మాట అన్నావు .. మీ ఫాదర్ చనిపోయిన తరువాత మీ మదర్ ఎలా పెంచారనేది. ఆమె దీవెనలు నిన్ను ఎక్కడికో తీసుకువెళతాయి .. అందులో డౌటు లేదు. 'పేపర్ బాయ్' నుంచి నేను నిన్ను చూస్తున్నాను .. చాలా హార్డు వర్క్ చేస్తావు. డెఫినెట్ గా నీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది.
అనూప్ తో నేను ఆల్రెడీ వర్క్ చేసి ఉన్నాను .. ఆయన ఈ సినిమాకి ఇచ్చిన పాటలు విన్నాను .. అవి సూపర్ హిట్. మెహ్రీన్ తో నేను రెండు సినిమాలు చేశాను .. చాలా మంచి మనిషి .. వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఈ సినిమా నిర్మాతలు చాలా జన్యూన్ గా ఎఫర్ట్ పెడతారు. మంచి మనసున్నవారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఇక అజయ్ ఘోష్ గారు .. ఆయన సినిమాలు చాలానే చూశాను. పెద్ద పెద్ద కళ్లతో విలన్ రోల్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు.
అలాంటి ఆయనను తీసుకొచ్చి మారుతిగారు ఫుల్ కామెడీ రోల్ చేయించారు. ఇప్పుడు నాకు అర్థమైంది ఆయనకి ఇన్ని రోజులుగా సరైన కేరక్టర్ పడలేదని. ఈ సినిమాతో డెఫినెట్ గా ఆయనకి మంచి రోజులు వస్తాయనిపిస్తోంది. కెమెరా పనితనం కూడా చాలా బాగుంది. ఇక మారుతి గురించి చెప్పాలంటే ఆయన ఒక పాజిటివ్ పర్సన్. కొంతమంది వ్యక్తులను చూస్తే ఒక రకమైన పాజిటివ్ వైబ్ ఉంటుంది. మారుతిని కలిసినప్పుడు నాకు అలాగే అనిపించింది. మేం చేస్తున్నది మా కాంబినేషన్లో ఫస్టు మూవీ. కానీ కొన్ని సంవత్సరాలు కలిసి పనిచేస్తే ఎలా ఉంటుందో అలాంటి అనుబంధం మా మధ్య ఏర్పడింది.
ఒక్క మాటలో చెప్పాలంటే మారుతి ఒక బ్రాండ్. మారుతి కారు మాదిరిగానే .. మారుతి సినిమాలు లోయర్ క్లాస్ నుంచి అప్పర్ క్లాస్ వరకూ నచ్చుతాయి. మారుతి .. నేను 'పక్కా కమర్షియల్' సినిమా షూటింగ్ చేస్తుండగా లాక్ డౌన్ పడింది. షూటింగు ఆపేసి అందరం ఇళ్లలో కూర్చున్నాం. మారుతి మాత్రం లాక్ డౌన్ లో ఒక సినిమా చేస్తున్నట్టు చెప్పగానే ఆశ్చర్యపోయాను. కాన్సెప్ట్ విన్నాను .. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా చేస్తూ ఉండాలి. దాసరిగారు అలా చేసేవారు. ఎప్పుడూ చిన్న సినిమా.. పెద్ద సినిమా అనేవి ఉండవు . ఏ సినిమా ఆడితే అదే పెద్ద సినిమా. థియేటర్లలోనే ఈ సినిమాను చూడండి .. థియేటర్లలో చూస్తే ఆ కిక్కే వేరు" అంటూ చెప్పుకొచ్చాడు.