గోపీచంద్ బాకీ తీర్చేసాన‌న్న డైరెక్ట‌ర్

Update: 2021-09-15 11:30 GMT
కొన్ని వ‌రుస ఫ్లాపుల త‌ర్వాత గోపిచంద్ క‌థానాయ‌కుడిగా న‌టించిన సీటీమార్ మంచి టాక్ తో బాక్సాఫీస్ వ‌ద్ద చ‌క్క‌ని వ‌సూళ్లను సాధించింద‌ని రిపోర్ట్ అందిన సంగ‌తి తెలిసిందే. గ‌తంలో `గౌత‌మ్ నంద‌`తో  ఫ్లాపునిచ్చిన సంప‌త్ నంది ఇప్పుడు బాకీ తీర్చేసుకున్నాన‌ని స‌క్సెస్ వేదిక‌పై ప్ర‌క‌టించారు.

సీటీమార్ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది మాట్లాడుతూ `` వినాయ‌క చ‌వితిరోజున విడుద‌లైన మా 'సీటీమార్'  చిత్రాన్ని పెద్ద హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు. కోవిడ్ సెకండ్ వేవ్ లో మ‌నకు ద‌గ్గ‌రైన వాళ్ల‌ని కోల్పోయాం. ఈ సినిమాకు వ‌ర్క్ చేసిన టీమ్ లోనూ కొంత మందిని మేం కోల్పోయాం. ఐదు నెల‌ల త‌ర్వాత థియేట‌ర్స్ లోకి వ‌చ్చిన ఈ సినిమాను,.. ప్రేక్ష‌కులు ప్రాణాల‌ను రిస్క్ లో పెట్టి పెద్ద హిట్ చేశారు. సాధార‌ణంగా నేను డైరెక్ట్ చేసిన ఏ సినిమా అయినా స‌రిగా ఆడ‌క‌పోతే,.. ఆ త‌ప్పు నాదేన‌ని చెబుతాను. అదే సినిమా పెద్ద హిట్ అయితే నా టీమ్‌కు ఆ స‌క్సెస్ క్రెడిట్ ద‌క్కుతుంద‌ని కూడా చెబుతుంటాను. 'సీటీమార్'  స‌క్సెస్ ఆనందాన్నిచ్చింది. మ‌ణిశ‌ర్మ‌ నాలుగు స‌క్సెస్ ఫుల్ పాట‌ల‌ను ఆయ‌న అందించారు.

సాధార‌ణంగా అంద‌రూ ఆయ‌న్ని మెలోడి బ్ర‌హ్మ అని అంటుంటారు. కానీ నేను మాత్రం ఆయ‌న్ని మాస్ కా బాస్‌.. బీజీఎం కా బా ద్‌షా అని అంటుంటాను. దీన్ని ఆయ‌న మ‌రోసారి ప్రూవ్ చేశారు. త‌ర్వాత ఫైట్ మాస్ట‌ర్స్ గురించి చెప్పుకోవాలి. నేను డిజైన్ చేసుకున్న యాక్ష‌న్ సీక్వెన్స్ లు అద్భుతంగా సిల్వ‌ర్ స్క్రీన్ పై వ‌చ్చేలా చేసిన స్టంట్ శివ‌గారు,.. వెంక‌ట్ గారు, ..జాషువా గారు, ..రియ‌ల్ స‌తీశ్ గారికి థాంక్స్‌. సౌంద‌ర్ రాజన్ నాతో ఐదేళ్లుగా ట్రావెల్ చేస్తున్నారు. నా క‌న్ను ఆయ‌నే.

నేను ఏదైనా ఊహిస్తే దాన్ని అంత కంటే గొప్ప‌గా ప్రెజెంట్ చేశారు. ఆయ‌న నాకు మెయిన్ పిల్ల‌ర్‌. ఎడిట‌ర్ త‌మ్మిరాజుగారికి,.. ఆర్ట్ డైరెక్ట‌ర్ స‌త్య‌నారాయ‌ణ‌గారికి.. డాన్స్ మాస్ట‌ర్ శోభిమాస్ట‌ర్ గారికి స్పెష‌ల్ థాంక్స్‌. నా రైటింగ్ టీమ్ కు,.. ధ‌నిఏలేగారికి, డైరెక్ష‌న్ టీమ్ కు మ‌న‌స్ఫూర్తిగా థాంక్స్‌. ఫ‌స్టాఫ్ లో రావు ర‌మేశ్ గారు త‌న‌దైన డైలాగ్ డెలివ‌రీతో హీరోకు స‌పోర్ట్ చేస్తూ సినిమాను నిల‌బెడితే, సెకండాఫ్ లో సినిమాకు హార్ట్ గా నిలిచిన యాక్ట‌ర్ పోసాని కృష్ణ‌ముర‌ళిగారు స‌హా ఇత‌ర ఆర్టిస్టుల‌కు థాంక్స్‌. గౌత‌మ్ నంద స‌మ‌యంలో నేను.. గోపీచంద్ గారు ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా తీస్తున్నామ‌ని అనుకున్నాం. కానీ ఎందుకో ఆ సినిమా ఎక్స్ పెక్టేష‌న్స్ ను రీచ్ కాలేక‌పోయింది. కానీ 'సీటీమార్' తో గోపీచంద్ గారి బాకీ తీర్చేసుకున్నాను.

సినిమా తొలి ఆట త‌ర్వాత సీడెడ్ డిస్ట్రిబ్యూట‌ర్ ఫోన్ చేసి సింహా అప్పుడు బాల‌కృష్ణ గారు.. బోయ‌పాటిగారు ఎలాంటి హిట్ కొట్టారు. ఇప్పుడు గోపీచంద్ గారు మీరు అంత పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టార‌ని అన్నాడు. ఇక జ్వాలా రెడ్డి వంటి పాత్ర‌ను గుర్తుండిపోయేలా చేసిన త‌మ‌న్నాకు థాంక్స్‌. నిర్మాత‌లు శ్రీనివాస్ చిట్టూరి,.. ప‌వ‌న్ గారి వ‌ల్లే ఈరోజు ఇలా స‌క్సెస్ మీట్ లో నిల‌బ‌డి మాట్లాడుతున్నాం. కథ చెప్పిన రోజే మేమున్నాం అని మా వెనుక నిల‌బ‌డ్డారు. ఆరోజు నుంచి ఈరోజు వ‌ర‌కు అలాగే మ‌మ్మ‌ల్ని ముందుకు న‌డిపిస్తూ వ‌స్తున్నారు. వారిద్ద‌రికీ మ‌న‌స్ఫూర్తిగా థాంక్స్ చెబుతున్నాను.

ఇది కేవ‌లం మాస్‌,.. క‌మ‌ర్షియ‌ల్ సినిమా మాత్ర‌మే కాదు.. స్త్రీ సాధికార‌త గురించి అమ్మాయిలు ప‌డే ఇబ్బందులు వాళ్ల‌కు మ‌నం ఇవ్వాల్సిన ఎంక‌రేజ్ మెంట్ గురించి చెప్పే సినిమా. సాధార‌ణంగా ప్ర‌తి మ‌గాడి విజ‌యం వెనుక ఆడ‌ది ఉందంటుంటారు. కానీ వాళ్లు ఎప్పుడూ వెనుకే ఎందుకు ఉండాలి. వాళ్లు ముందుకు రాకూడ‌దా?  విజ‌యాలు సాధించ‌కూడ‌దా? అని చెప్పి వాళ్ల విజ‌యాల కోసం వెన‌కాల నిల‌బ‌డ్డ ఒక మ‌గ‌వాడి క‌థే ఈ సినిమా. ఆడ‌వాళ్ల విజ‌యం కోసం నిల‌బ‌డ్డ ఓ అన్న‌య్య క‌థే ఈ సీటీమార్‌. మీరు వంద రూపాయ‌లు పెట్టి ఈ సినిమా చూస్తే వెయ్యి రూపాయ‌ల ఆనందాన్నిచ్చే సినిమా ఇద‌ని మ‌న‌స్ఫూర్తిగా, న‌మ్మ‌కంతో చెబుతున్నాను. సాధారణంగా జై జవాన్, జై కిసాన్ అంటుంటారు. కానీ ఓ అమ్మ ప్రేమ తెలిసిన వ్య‌క్తిగా.. భార్య ప్రేమ తెలిసిన వ్య‌క్తిగా, .. కూతురి ప్రేమ తెలిసిన వ్య‌క్తిగా చెబుతున్నాను. జై ఔర‌త్‌, జీయో ఔర‌త్ అని చెబుతున్నాను`` అన్నారు.

గోపీచంద్ మాట్లాడుతూ ''సినిమా త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కులను థియేట‌ర్ కు తీసుకొస్తుంద‌నే గట్టి న‌మ్మ‌కంతో అన్నాను.  ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌చ్చి మాకు చాలా పెద్ద విజ‌యాన్ని అందించారు. అందుకు ధ‌న్య‌వాదాలు. డైరెక్ట‌ర్ సంప‌త్ తో గౌత‌మ్‌నంద చేశాం. ఆ సినిమాను చాలా పెద్ద హిట్ అవుతుంద‌ని ఎక్స్‌పెక్ట్ చేశాం. కానీ ఎందుకో ఆ సినిమాతో అనుకున్న‌ది రీచ్ కాలేక‌పోయాం. ఈ సినిమా చేయాల‌నుకున్న‌ప్పుడు ముందు ఒక స్టోరి అనుకున్నాం.

 కానీ వ‌ర్క‌వుట్ కాద‌నుకున్నాం. రెండు నెల‌ల త‌ర్వాత సంప‌త్ ఈ స్టోరితో వ‌చ్చాడు. చాలా మంచి స్టోరి కుదిరింద‌ని అనుకున్నాను. చాలా డిస్క‌స్ చేసుకున్నాం. మ‌ధ్య‌లో పాండ‌మిక్ వ‌చ్చింది. ఈ గ్యాప్ లో సంప‌త్ స్టోరిని ఇంకా బెట‌ర్ మెంట్ గా మార్చాడు. ఈ సినిమా అయితే చాలా క‌ష్ట‌మైపోతుంద‌నే భ‌యం ఇద్ద‌రికీ ఉండేది. కానీ ఏమైనా ఈ సినిమా మిస్ కాకూడ‌ద‌ని అనుకున్నాం. నేను జెన్యూన్ గా హిట్ అనే మాట విని చాలా కాల‌మైంది. అంత‌కు ముందు హిట్స్ వ‌చ్చాయి.

 కానీ ఈ మ‌ధ్య కాలంలో నా సినిమాల‌ను హిట్ అని విన్లేదు. కానీ సినిమా కొర‌త తీర్చేసింది. నేను హిట్స్‌.. ప్లాప్స్ చూశాను. నా సినిమా హిట్టా,.. ప్లాపా అని నా ఫోన్ చెప్పేస్తుంది. ఇంకొక‌రు చెబితే నేను విన‌ను. హిట్ సౌండ్ ఎలా ఉంటుంది?  ప్లాప్ సౌండ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నిర్మాత‌లు శ్రీనివాస్ చిట్టూరి.. ప‌వ‌న్‌గారు ఈ సినిమా కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డారో నాకు తెలుసు. కానీ ఎవ‌రూ ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి. వాళ్ల ప‌డ్డ క‌ష్టానికి ఈరోజు ఇంత పెద్ద హిట్ వ‌చ్చింది. నా నిర్మాత‌ల‌కు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ఆర్టిస్టుల‌కు.., టెక్నీషియ‌న్స్‌.. ప్రేక్ష‌కుల‌కు పేరు పేరునా చేతులెత్తి దండం పెడుతున్నాం. ఈ నిర్మాత‌లు ఇంకా మంచి సినిమాలు తీసి పెద్ద ప్రొడ్యూస‌ర్స్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సంప‌త్ కూడా ఈ హిట్ తో ఆప‌కుండా ఇంకా పెద్ద హిట్ మూవీస్ చేయాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అన్నారు.
Tags:    

Similar News