రూటు మార్చు గోపిచంద్

Update: 2018-06-18 05:57 GMT
ఇప్పుడు ఏమో గాని ఒక్క ఐదారేళ్లు  వెనక్కు వెళ్తే గోపిచంద్ తన సినిమాల విడుదల రోజున స్టార్ హీరో రేంజ్ లో హంగామా చేయించుకున్నవాడే. అదంతా గతం. గోపిచంద్ సినిమా వస్తోంది అంటే బయ్యర్లు ఒకటిరెండు సార్లు ఆలోచించి కొనే పరిస్థితి వచ్చేసింది. గత ఏడాది బి.గోపాల్ దర్శకత్వంలో చేసిన ఆరడుగుల బుల్లెట్ అడ్వాన్సు బుకింగ్ లో టికెట్లు అమ్మాక విడుదల ఆగిపోయింది. అసలు వస్తుందో రాదో హీరోకే కాదు నిర్మాతకు కూడా తెలియదు. ఇక రిలీజ్ అయిన గౌతమ్ నందా-ఆక్సిజన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇవన్నీ మొత్తంగా ఇప్పుడు కొత్త సినిమా పంతంపై ప్రభావం చూపిస్తున్నాయి. బజ్ లేకపోవడంతో అది పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏవి ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఏదో మూడక్షరాల సెంటిమెంట్ కలిసి వచ్చిందని పంతం అని పెట్టిన టైటిల్ కూడా నెగటివ్ ఫీడ్ బ్యాక్ అందుకుంటోంది. పాత మూస తరహాలో అనిపించే అలాంటి పేర్లు ప్రేక్షకులకు పెద్దగా కిక్ ఇవ్వడం లేదు. అందుకే పంతం మీద ఇంత అనాసక్తి ఉండడానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. యాక్షన్ డ్రామాల్లో చూసి చూసి విసుగొచ్చిన ప్రేక్షకులు గోపిచంద్ ని కొత్త తరహా సబ్జెక్ట్స్ లో చూడాలని కోరుకుంటున్నారు. కానీ గోపిచంద్ మాత్రం తన పంధా వీడటం లేదు.

తాజాగా వదిలిన పంతం టీజర్లో కేవలం ఫైట్స్ తో పాటు యాక్షన్  సీక్వెన్స్ లనే ఎక్కువ హై లైట్ చేయటంతో ఇది కూడా రెగ్యులర్ ఫార్ములా సినిమా అనే అభిప్రాయంతో బయ్యర్లు వెనుకడుగు వేస్తున్నట్టు సమాచారం. యుఎస్ లో గోపికి మార్కెట్ సున్నా. ఏదోలా విడుదల చేసుకున్నా కంటెంట్ రొటీన్ గా ఉంటే మాత్రం రెండో రోజే వెనక్కు వచ్చే పరిస్థితి. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నప్ప్పుడు తనకు అచ్చి వచ్చిన ఫ్యామిలీ డ్రామా వైపు మొగ్గు చూపకుండా గోపిచంద్ ఇలా పదే పదే మసాలా కంటెంట్ వైపు వెళ్లడం ఏ మాత్రం వర్క్ అవుట్ కావడం లేదు.  ఇలా అయితే జులై 6 అనుకుంటున్న విడుదలను ఇంకాస్త వాయిదా వేయాల్సిన పరిస్థితి వస్తుంది. గోపీచంద్ అర్జెంట్ తన యాక్షన్ మేనియా నుంచి బయటికి రావాలి. తనకు బలమైన కామెడీ టైమింగ్ తో యాక్షన్ మిస్ చేయకుండా ఫ్యామిలీ సెక్షన్ ని టార్గెట్ చేస్తే తనను ప్రత్యేకంగా ఇష్టపడే అభిమానులు వెనక్కు వస్తారు. అంతేతప్ప పంతం పగ అంటూ అవుట్ డేటెడ్ స్టఫ్ తో వస్తే కష్టమే. ఒకవేళ పంతం కనక మెప్పిస్తే గోపి కన్నా ఎక్కువ అతన్ని  ఇష్టపడేవాళ్లు సంతోషపడతారు. ఇకనైనా గోపీచంద్ ఫామిలీ ట్రాక్  వైపు చూపు మళ్లిస్తే బెటర్
Tags:    

Similar News