ఈ విలనీ లాజిక్ మిస్సయ్యారబ్బా!!

Update: 2017-07-28 17:49 GMT
హీరో గోపిచంద్ చాలా కాలంగా హిట్లు లేక బాధపడుతున్నాడు. నిజానికి మనోడు సరైన కథలను ఎంపిక చేసుకోకపోవడం వలనే సరైన హిట్లు కొట్టలేకపోతున్నాడని విశ్లేషకులు ఎప్పటినుండో చెబుతున్నారు. అయితే ఇప్పుడు తన కొత్త సినిమా ''గౌతమ్ నంద''తో గోపి చాలా పెద్ద విజయం సొంతం చేసుకుందాం అనుకున్నాడు కాని.. అది ఫలిస్తుందో లేదో అప్పుడే చెప్పలేం. సోమవారం నాటి కలక్షన్లే ఈ సినిమా భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి.

ఈ సందర్భంగా మాట్లాడుకుంటే.. అసలు గోపిచంద్ ఈ సినిమాలో నెగెటివ్ క్యారెక్టర్ ఎందుకు చేశాడు అనేదాన్ని ఒకసారి చర్చించాలి. ఈ మధ్యకాలంలో చాలామంది హీరోలు తమకు తాము నెగెటివ్ రోల్ చేసుకుంటే ఎలా ఉంటుంది అంటూ తెగ చూసుకుంటున్నారు. మొన్న తమిళంలో విజయ్ అండ్ సూర్య తమ సినిమాల్లో తామే విలన్ గా డబుల్ యాక్షన్ చేసుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా జయ లవకుశలో విలన్ గా చేసుకుంటున్నాడు. ఇదే సమయంలో గోపి కూడా అదే ప్రయత్నం చేశాడు. కాని మ్యాటర్ ఏంటంటే.. ఆ హీరోలు ఉత్తినే విలనీ చేసినా అదేదో కొత్తగా అనిపించింది కాని.. గోపి విలనీ మాత్రం ఎందుకో కనక్ట్ అవ్వలేదు. దానికి ఒక కారణం ఉంది.

నిజానికి ఆ హీరోలందరికీ నెగెటివ్ వేషాలు అదే మొదటిసారి. కాని గోపిచంద్ మాత్రం చాలా సినిమాల్లో ఆల్రెడీ నెగెటివ్ రోల్ తో మెప్పించాడు. అసలు గౌతమ్ నంద సినిమాలో చూపించినదానికంటే ఒక వంద రెట్ల ఎక్కువ విలనిజంను 'జయం' 'వర్షం' వంటి సినిమాల్లో కనబరిచాడు. అలాంటప్పుడు మనోడు ఇప్పుడు ఏదో సాంపిల్ చేసినట్లు ఓ చిన్నసైజు విలన్ గా కనిపిస్తే.. జనాలకు కిక్కు ఎక్కువగా రాదు. ఈ లాజిక్ దర్శకుడు సంపత్ నంది కూడా మిస్సయినట్లున్నాడు.
Tags:    

Similar News