గోపీచంద్ కు మాస్ హీరోగా చాలానే ఇమేజ్ ఉంది. కానీ వరుసగా సినిమాలు మూస ధోరణిలో ఉండడం.. ఈ మధ్య వచ్చిన సినిమాలు రిలీజ్ కే నానా కష్టాలు పడాల్సి రావడం.. ప్రమోషన్స్ విషయంలో కూడా బాగా వెనకబడడం వంటివి.. రిజల్ట్ పై నేరుగానే ఎఫెక్ట్ చూపుతున్నాయి. అయినా సరే.. గోపీచంద్ కు సినిమాల కొరత ఏమీ ఉండదంటే.. ఈ మాస్ హీరోకు జనాల్లో ఉన్న క్రేజ్ పై మేకర్స్ కాన్ఫిడెన్స్ అర్ధమవుతుంది.
ఇప్పుడు పంతం అంటూ ఓ కొత్త మూవీని ఫినిష్ చేస్తున్నాడు గోపీచంద్. కె చక్రవర్తి అనే కొత్త దర్శకుడు తన రచనలోనే ఈ సినిమా తీస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. పంతం టీజర్ లో వినిపించిన ఒకటి రెండు డైలాగ్స్ తోనే.. ఇది పొలిటికల్ టచ్ ఉన్న మూవీ అనిపిస్తుంది. ప్రధానంగా రాజకీయ అవినీతి పైనే ఫోకస్ చేశారని చెబుతున్నారు. టీజర్ ఆరంభంలో గోపీచంద్ కామెడీగా చెప్పిన 'లోపలున్నది బైటకు తోస్తాం.. బైట ఉన్నది లోపలకు తోస్తాం'డైలాగ్ ఈ అవినీతి గురించే.
అయితే.. పంతం మూవీలో పొలిటికల్ టచ్ కాదని.. పొలిటికల్ సైటైర్ గానే ఈ సినిమా తీస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా ఒక తెలుగు స్టేట్ లో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఈ మూవీ స్టోరీ.. స్క్రీన్ ప్లే ఉంటాయట. నేరుగా పేరు చెప్పినా చెప్పకపోయినా.. ఫోకస్ మాత్రం ఆ పార్టీ లక్ష్యంగానే ఉంటుందట. భూ అక్రమాలు అన్నది మూవీ మెయిన్ థీమ్ అంటున్నారు. ఆల్ ఫ్రీ అంటూ ఉచితంగా అన్నీ ఇస్తామంటే నమ్మేసి.. తర్వాత తీరిగ్గా అవినీతి గురించి ఆవేశపడే జనాలకు కూడా క్లాసులు ఉంటాయని.. ముఖ్యంగా కోర్టు సీన్ అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు.