తెలుగు ప్రేక్షకుల ముందుకు తెలుగు ఇండియన్ ఐడల్ అంటూ ఆహా ఓటీటీ వారు ఒక సరికొత్త భారీ సింగింగ్ రియాల్టీ షో ను తీసుకు వచ్చారు. ఒక ఓటీటీ లో తెలుగు ప్రేక్షకుల ముందుకు ఇలాంటి షో రావడం ఇదే ప్రథమం. ఆహా కు ఉన్న ఆధరణ నేపథ్యంలో ఈ షో కు కూడా మంచి ఆదరణ లభించింది. టీవీల్లో చూసినట్లుగానే ఈ సింగింగ్ కాంపిటీషన్ ను జనాలు తెగ చూస్తున్నారు.
తెలుగు ఇండియన్ ఐడల్ మొదటి సీజన్ కు జడ్జ్ లుగా థమన్.. నిత్యా మీనన్ మరియు సింగర్ కార్తీక్ లు వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. ఇలాంటి షోల్లో పాటలతో పాటు కాస్త డ్రామా యాడ్ చేస్తేనే ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తారు. కేవలం పాటలు ఉంటే జనాలు ఆసక్తి చూపించరు. అందుకే ఈ కార్యక్రమంలో కూడా ఢీ డాన్స్ షో లో మాదిరిగా కాస్త డ్రామాను యాడ్ చేసి పాటకు పాటకు మద్య కాస్త వాతావరణంను కూల్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.
అది షో సక్సెస్ కు ఉపయోగపడింది. హీరోయిన్ నిత్యా మీనన్ అబ్బాయిలతో చిలిపి ముచ్చట్లు మరియు యాంకర్ శ్రీరామ చంద్ర మరియు సింగర్ కార్తీక్ ల సరదా సంభాషణ ఇలా సాగి పోతూ ఉండగా.. ఒక ఫెర్ఫార్మెన్స్ విషయంలో సంగీత దర్శకుడు థమన్ మరియు హీరోయిన్ నిత్యా మీనన్ మద్య కాస్త సీరియస్ గానే చర్చ జరిగిందట. ఆ విషయం ఆ నోట ఈ నోట పడి బయటకు వచ్చింది.
మారుతి అనే కంటెస్టెంట్ డబుల్ ధమాకా స్పెషల్ లో భాగంగా ఏవండోయ్ నాని గారు పాట పాడుతున్న సమయంలో చర్చ జరిగిందట. ఇద్దరు కూడా జడ్జ్ మెంట్ విషయంలో విభేదించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో థమన్ మరియు నిత్యా మీనన్ మద్య కాస్త సీరియస్ గానే వాగ్వాదం జరిగిందనే సమాచారం టీమ్ నుండి వినిపిస్తుంది.
స్క్రిప్ట్ ప్రకారం జరిగిన సరదా గొడవలు అయితే స్ట్రీమింగ్ చేస్తారు. కాని థమన్ మరియు నిత్యా మీనన్ మద్య జరిగిన గొడవ కాస్త సీరియస్ గానే జరిగింది కనుక స్ట్రీమింగ్ చేయక పోవచ్చు. ఇక ఈ గొడవ సందర్బంగా మరో జడ్జ్ అయిన కార్తిక్ మొదట నిత్యా మనన్ కు మద్దతుగా నిలిచాడట. కొంత చర్చ జరిగిన తర్వాత ఆయన థమన్ వైపు వెళ్లాడని కూడా సమాచారం అందుతోంది.
ఈ గొడవ మరింత ముదిరితే థమన్ లేదా నిత్యా మీనన్ ల్లో ఎవరో ఒకరు షో నుండి తప్పుకునే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ గొడవను ఆహా టీమ్ ఎలా క్లియర్ చేస్తారు అనేది చూడాలి. బయటకు పొక్కకుండానే జాగ్రత్త పడుతూ గొడవ క్లియర్ చేయాలని భావించినా కూడా తెలుగు ఇండియన్ ఐడల్ లో ఏదో జరుగుతుంది అంటూ బయటకు లీక్ అవ్వడంతో ఇండస్ట్రీ వర్గాలతో పాటు మీడియా వర్గాల్లో కూడా చర్చ మొదలు అయ్యింది.
ఆ చర్చ జనాల్లోకి కూడా రావడంతో ఇక ఆహా వారి నుండి ఒక క్లారిటీ రావాల్సి వచ్చింది. వచ్చే వారం ఎపిసోడ్ లో థమన్ మరియు నిత్యా మీనన్ లు కలిసి కనిపిస్తారా లేదా అనేది చూడాలి. షో మద్యలో వారిద్దరిలో ఎవరు వెళ్లి పోయినా కూడా ఆహా టీమ్ కు చాలా డ్యామేజీ అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు ఆహా టీమ్ ఏం చేయబోతుంది అనేది చూడాలి.