పెళ్లికి ముందు కంటే పెళ్లి అయిన తర్వాత ప్రియాంక చోప్రా కాస్ట్యూమ్స్ గురించి మీడియాలో ఎక్కువగా వివాదాస్పదం అవుతున్న విషయం తెల్సిందే. పెళ్లి అయిన తర్వాత ఇలాంటి డ్రస్ లు ఏంటీ అంటూ కొందరు.. ఇండియన్ అయ్యి ఉండి ఇలాంటి డ్రస్ లు ఏంటీ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. తాజాగా అమెరికా లాస్ ఏంజెల్స్ లో జరిగిన గ్రామీ అవార్డు వేడుకల్లో ఇండియా కు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రియాంక చోప్రా పాల్గొన్న విషయం తెల్సిందే.
గ్రామీ అవార్డు వేడుకల్లో పాల్గొనడం అంటే చాలా గౌరవం దక్కించుకున్నట్లు. అలాగే అక్కడ ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించడం అంటే వారి ప్రవర్తిన మరియు వారి డ్రస్సింగ్ అన్ని కూడా ఇండియాను రిప్రజెంట్ చేసే విధంగా ఉంటాయి. ప్రపంచం మొత్తం మీడియా లో గ్రామీ అవార్డు వేడుక గురించి కథనాలు రాస్తారు. అలాంటి కార్యక్రమంలో ఇండియా తరపున పాల్గొని చెత్త డ్రస్ ను వేసుకోవడంను చాలా మంది ఇండియన్స్ తప్పుబడుతూ విమర్శలు గుప్పించారు.
సోషల్ మీడియాలో ప్రియాంక డ్రస్ పై దారుణమైన కామెంట్స్ చేశారు. ప్రియాంక డ్రస్ పై వస్తున్న విమర్శలకు ఆమె తల్లి మధు చోప్రా స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. నాకు ప్రియాంక డ్రెస్ చాలా నచ్చింది. ఆ డ్రస్ కు సంబంధించిన డిజైన్ ను ముందు నాకు చూపించింది. అయితే మొదట ఆ డ్రస్ ను క్యారీ చేయడం కష్టం కావచ్చు అనుకున్నారు. కాని ప్రియాంక చాలా బాగా హ్యాండిల్ చేసిందని మధు చోప్రా అన్నారు. ప్రియాంక ఇప్పటి వరకు ధరించిన డిజైనర్ డ్రస్‌లలో ది బెస్ట్ వన్ అంటూ ఆమె పేర్కొన్నారు.
నెటిజన్స్ విమర్శలతో నా కూతురు మరింత స్ట్రాంగ్ గా తయారు అవుతుందని.. ఆమెను విమర్శించినంత మాత్రాన కృంగిపోదు అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఒక తల్లి అయ్యి ఉండి కూతురు డ్రస్ ల విషయంలో జాగ్రత్తలు చెప్పాల్సింది పోయి ఆ చెత్త డ్రస్ ది బెస్ట్ వన్ అంటూ కాంప్లిమెంట్ ఇవ్వడం ఏంటమ్మా అంటూ నెటిజన్స్ మధు చోప్రాను ప్రశ్నిస్తున్నారు.