చిత్రం : ‘గుంటూరోడు’
నటీనటులు: మంచు మనోజ్ - ప్రగ్యా జైశ్వాల్ - సంపత్ రాజ్ - కోట శ్రీనివాసరావు - రాజేంద్ర ప్రసాద్ - రావు రమేష్ - సత్య - ప్రవీణ్ - రాజా రవీంద్ర తదితరులు
సంగీతం: డీజే వసంత్
నేపథ్య సంగీతం: చిన్నా
ఛాయాగ్రహణం: సిద్దార్థ్ రామస్వామి
నిర్మాత: శ్రీ వరుణ్ అట్లూరి
రచన - దర్శకత్వం: ఎస్కే సత్య
గత ఏడాది శౌర్య.. ఎటాక్ సినిమాలతో గట్టి ఎదురు దెబ్బలు తిన్నాడు మంచు మనోజ్. ఈసారి అతను రూటు మార్చి తనదైన స్టయిల్లో పక్కా మాస్ మసాలా సినిమా చేశాడు. అదే.. గుంటూరోడు. ‘నా రాకుమారుడు’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఎస్కే సత్య రూపొందించిన సినిమా ఇది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘గుంటూరోడు’ విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
కన్నా (మంచు మనోజ్) చిన్నతనం నుంచి చాలా దూకుడుగా పెరిగిన కుర్రాడు. అతడి చేతికి దురదెక్కువ. దేనికైనా చేత్తోనే జవాబు చెబుతాడు. అతను అనుకోకుండా ఓ చిన్న గొడవలో శేషు (సంపత్ రాజ్)పై చేయి చేసుకుంటాడు. శేషు పెద్ద క్రిమినల్ లాయర్. తనకు అడ్డం వచ్చిన వాళ్ల అంతు చూడటం అతడికి అలవాటు. తనపై చేయి చేసుకున్న కన్నాను చంపాలని చాలా కసిగా ఉంటాడు శేషు. అతడి కోసం మనుషుల్ని పెట్టి వెతికిస్తుంటాడు. ఈ లోపు తన పెళ్లిచూపులకు వచ్చిన అమృత (ప్రగ్యా జైశ్వాల్)ను చూసి ప్రేమలో పడిపోయిన కన్నా.. ఆమెను ప్రేమలో దింపే ప్రయత్నంలో ఉంటాడు. ఐతే అమృత అతడి ప్రేమను ఒప్పుకునే సమయానికే శేషు మనుషులు అతడిపై దాడికి దిగుతారు. అదే సమయంలో కన్నాకు ఇంకో ఆశ్చర్యకర విషయం తెలుస్తుంది. ఆ విషయమేంటి.. కన్నా-శేషు మధ్య గొడవ ఎక్కడిదాకా వెళ్లింది.. కన్నా-అమృత ఒక్కటయ్యారా లేదా అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
విలన్ చాలా పవర్ ఫుల్. హీరో సామాన్యుడు. కానీ అనుకోకుండా ఒక చిన్న గొడవలో భాగంగా హీరో విలన్ని ఉతికారేస్తాడు. తర్వాత హీరో కోసం విలన్ వేట మొదలుపెడతాడు. సగం సినిమా అయ్యేసరికి విలన్ కు హీరో దొరుకుతాడు. ఇక ఆ తర్వాత నువ్వా నేనా అన్నట్లు పోరు. చివర్లో విలన్ మీద హీరో పైచేయి సాధిస్తాడు. ఇలాంటి కథలతో తెలుగులో ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్కే లేదు. ‘గుంటూరోడు’ కూడా ఇదే ఫార్మాట్లో సాగే సినిమా. ఆరంభం నుంచి చివరిదాకా ఏమాత్రం కొత్తదనం లేకుండా రొటీన్ గా.. ఒక ఫార్మాట్ ప్రకారం సాగిపోయే సినిమా ‘గుంటూరోడు’. మాస్ ప్రేక్షకులు కోరుకునే హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు మినహాయిస్తే ‘గుంటూరోడు’లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ అంశాలేమీ లేవు.
రొటీన్ కథల్ని కూడా కొంచెం వైవిధ్యంగా చెబుతూ.. ఎంటర్టైన్ చేస్తుంటారు కొందరు దర్శకులు. ఐతే ఎస్కే సత్య అలాంటి ప్రయత్నం ఏదీ చేయలేదు. అతడి దృష్టంతా మనోజ్ ను మాస్ హీరోగా ప్రెజెంట్ చేయడం మీదే నిలిచింది. అతడి ఎనర్జీకి తగ్గట్లుగా కొన్ని యాక్షన్ ఎపిసోడ్లు సెట్ చేసుకుని.. కొన్ని పాటలు.. కొంచెం కామెడీ అన్నట్లు కొన్ని కమర్షియల్ హంగులద్దుకుని ‘గుంటూరోడు’ను మాస్ ప్రేక్షకులకు చేరువ చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఇలాంటి యాక్షన్ ఎపిసోడ్లు.. పాటలు కూడా కొత్తేమీ కాదు. మనోజ్ తాను చేసిన మాస్ సినిమాల్లో ఇలాంటి యాక్షన్ విన్యాసాలు చాలానే చేశాడు. కాకపోతే ఇక్కడ ఇంకొంచెం ఇంటెన్సిటీ పెంచాడంతే.
‘గుంటూరోడు’కు ‘లవ్ లో పడ్డాడు’ అనే క్యాప్షన్ పెట్టారు. అంటే ప్రేమ కథకు సినిమాలో చాలా ప్రాధాన్యం ఉంటుందని.. అది కొంచెం ప్రత్యేకంగా ఉంటుందని ఆశిస్తాం. ఐతే సినిమాలో ఎక్కువ నిరాశ పరిచేది ఆ ప్రేమకథే. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బోరింగ్ గా సాగుతాయి. హీరోయిన్.. హీరోను ప్రేమించడానికి అసలు కారణాలే కనిపించవు. హీరోను అసహ్యించుకున్నట్లు కనిపించే హీరోయిన్.. తన కుక్కను త్యాగం చేశాడని అతడితో ప్రేమలో పడిపోవడం సిల్లీగా అనిపిస్తుంది. కామెడీ కూడా పెద్దగా వర్కవుటవ్వలేదు. సరిగ్గా నవ్వించే సీన్ ఒక్కటీ లేదు.
ఇక హీరో-విలన్ మధ్య పోరు కూడా ఏమంత ఎగ్జైటింగ్ గా అనిపించదు. విలన్ పాత్ర పరిచయం ఆసక్తికరంగా అనిపిస్తుంది. సంపత్ రాజ్ లాంటి మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న నటుడు ఆ పాత్రను చేయడంతో హీరో-విలన్ పోరాటం హోరాహోరీగా సాగుతుందని ఆశిస్తాం. ఐతే వీళ్లిద్దరి మధ్య ఎత్తులు పైఎత్తులు సాధారణంగా ఉంటాయి. ద్వితీయార్ధం తేలిపోయింది. ప్రి క్లైమాక్స్ లో సినిమా కొంచెం పైకి లేచినట్లు అనిపించినా.. క్లైమాక్స్ నిరాశ పరుస్తుంది. తాను స్కూల్లో ఉన్నపుడు ఎస్పీఎల్ అయిపోయే ఛాన్సిచ్చాడంటూ రాజేంద్ర ప్రసాద్ ను చూపించి మంత్రిగా ఉన్న రావు రమేష్ ఎమోషనల్ అయిపోతుంటే కామెడీగా అనిపిస్తుంది. ఇలాంటి మాస్ సినిమాకు అలాంటి క్లైమాక్స్ ఏంటో అర్థం కాదు.
ఇంటర్వెల్ ముందు.. ప్రి క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్లు మాస్ ప్రేక్షకుల్ని అలరిస్తాయి. ఈ రెండు చోట్లా హీరోయిజం బాగానే ఎలివేట్ అయ్యింది. ఈ సన్నివేశాల్లో డైలాగులు కూడా ఓకే. తండ్రీ కొడుకుల మధ్య సెంటిమెంటు కొంత వర్కవుట్ అయింది. పాటలు పర్వాలేదు. ‘గుంటూరోడు’లో చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్స్ ఇవే. కమర్షియల్ సినిమా అంటే కథాకథనాల గురించి పట్టించుకోనక్కర్లేదని.. నాలుగు ఫైట్లు... నాలుగు పాటలు.. నాలుగు కామెడీ సీన్లు పెట్టుకుని ఒక ఫార్మాట్ ప్రకారం సేఫ్ గేమ్ ఆడేద్దామని చూసినట్లుంది ‘గుంటూరోడు’ బృందం. తమ అభిరుచి మారిందని ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చాటి చెబుతున్నా.. ఇలాంటి సినిమాలు కొనసాగుతూనే ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. కొత్తదనం కాస్తయినా లేని ఈ సినిమా ఫేట్ మాస్ ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది.
నటీనటులు:
మంచు మనోజ్ ఇంతకుముందు మాస్ సినిమాల్లో ఎలా కనిపించాడో ఇందులోనూ అలాగే ఉన్నాడు. అతడి పాత్ర.. అతడి ఎనర్జీ.. అతను చేసిన ఫైట్లు మాస్ ప్రేక్షకుల్ని అలరిస్తాయి. రౌద్రం చూపించడంలో మనోజ్ తన ప్రత్యేకత చాటుకున్నాడు. మోహన్ బాబు స్టయిల్లో చెప్పిన కొన్ని డైలాగులు అతడి అభిమానుల్ని ఆకట్టుకుంటాయి. లుక్ పరంగా మాత్రం మనోజ్ పెద్దగా మార్పు చూపించలేదు. కొంచెం ఎబ్బెట్టుగానే ఉన్నాడు. మరీ సన్నగా ఉన్న ప్రగ్యా జైశ్వాల్ తో మనోజ్ కు జోడీ సరిగా కుదర్లేదు. ప్రగ్యా అందంగా కనిపించి ఆకట్టుకుంది. ఐతే ఆమె తన నటనా ప్రతిభను చూపించేంత విషయం పాత్రలో లేదు. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ పాత్ర ఎలా ఉంటుందని ఊహిస్తామో అలాగే ఉంది ఈ క్యారెక్టర్. సినిమాలో పాత్ర చిత్రణ.. నటన పరంగా అందరి కంటే ఎక్కువ మెప్పించేది సంపత్ రాజే. అతడి బాడీ లాంగ్వేజ్.. డిక్షన్ ఆకట్టుకుంటాయి. రాజేంద్ర ప్రసాద్ కూడా బాగా చేశాడు. కోట శ్రీనివాసరావు ఓకే. రావు రమేష్ చివర్లో చిన్న అతిథి పాత్ర లాంటిది చేశాడు. అదేమంత ప్రత్యేకంగా లేదు. సత్య.. ప్రవీణ్ పర్వాలేదు.
సాంకేతికవర్గం:
డీజే వసంత్ పాటలు ఓకే. మాస్ సాంగ్స్ కంటే కూడా ప్రేమ పాటలు బాగున్నాయి. చంపేసినా చంపేసినా పాట అన్నింట్లోకి బాగా ఆకట్టుకుంటుంది. చిన్నా నేపథ్య సంగీతంలో ఏమాత్రం ప్రత్యేకత లేదు. ఆర్.ఆర్ ఎక్కడో విన్నట్లే ఉంటుంది. ‘సరైనోడు’ బ్యాగ్రౌండ్ స్కోర్ ను దించేశాడు కొన్నిచోట్ల. సిద్దార్థ్ రామస్వామి ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో కెమెరా పనితనం కనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఓకే. ఇక రైటర్ కం డైరెక్టర్ ఎస్కే సత్య.. కథాకథనాల్లో ఎక్కడా కూడా కొత్తదనం కోసం ప్రయత్నించలేదు. అలా సినిమాల స్ఫూర్తితో ఈ కథను అల్లాడనిపిస్తుంది. కేవలం మాస్ ప్రేక్షకుల్ని అలరించడమే ధ్యేయంగా వారికి నచ్చే అంశాలతో ఒక ప్యాకేజీలా ఈ సినిమాను తయారు చేసే ప్రయత్నం చేశాడు. కథలో కానీ.. కథనంలో కానీ అంత ఎగ్జైట్ చేసే అంశాలేమీ లేవు.
చివరగా: గుంటూరోడు.. మరీ రొటీన్ గా ఉన్నాడు
రేటింగ్ - 2.5/5
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre