ఓ సినిమా సక్సెస్ అవునో కాదో చెప్పేందుకు వీకెండ్స్ తర్వాత కలెక్షన్స్ నే ప్రామాణికంగా తీసుకోవాలి. అడ్వాన్స్ బుకింగ్స్ కారణంగా వీకెండ్స్ లో చాలావరకూ సినిమాలు ఫుల్స్ నడుస్తాయి. స్టార్ హీరోల సినిమాలైతే ముందుగానే థియేటర్ల కొద్దీ బ్లాక్ అయిపోతుంటాయి. కానీ సోమవారం నుంచే మొదలవుతుంది అసలు సంగతి.
ఈ విషయంలో వెంకటేష్ మూవీ గురు స్టడీగానే నిలబడింది. వీకెండ్స్ తర్వాత కూడా వసూళ్లు ఏ మాత్రం తడబడలేదు. స్ట్రిక్ట్ బడ్జెట్ లో రూపొందిన ఈ చిత్రం.. తొలి ఆరు రోజులు గడిచేసరికి తెలుగు రాష్ట్రాల వరకే 10 కోట్ల రూపాయల థియేట్రికల్ షేర్ ను రాబట్టగలిగింది. నైజాంలో.. 3.90 కోట్లు.. సీడెడ్ 1.35 కోట్లు.. నెల్లూరు 29 లక్షలు, కృష్ణా 92.5 లక్షలు.. గుంటూరు 76.8 లక్షలు, వెస్ట్ 52.8 లక్షలు.. ఈస్ట్ 81.2 లక్షలు.. ఉత్తరాంధ్ర 1.45 కోట్ల వసూళ్లు వచ్చాయి. మొత్తం 10.03 కోట్ల రూపాయల షేర్ మొదటి ఆరు రోజులకు లభించింది.
ఈ చిత్రాన్ని దాదాపుగా సురేష్ బాబు స్వయంగా రిలీజ్ చేసుకోగా.. వసూళ్లు నిలకడగా ఉండడంతో ఎగ్జిబిటర్స్ అందరూ హ్యాపీగానే ఉన్నారు. మరోవారం పాటు సత్తా చాటే అవకాశం గురుకి ఉండగా.. ఓవర్సీస్ మార్కెట్లో మాత్రం గురు రిజక్ట్ అయిన సంగతి తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/