రూ.2వేల కోట్ల సినిమాకు షాకిచ్చిన హ్యాక‌ర్లు

Update: 2017-05-16 09:43 GMT
ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న రాన్స‌మ్ వేర్ హ్యాక‌ర్ల తీరు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఇప్ప‌టివ‌ర‌కూ వివిధ దేశాల్లోని బ్యాకింగ్‌.. వైద్య రంగాల్ని తీవ్ర ప్ర‌భావితం చేసిన వారు.. తాజాగా ఓ భారీ బ‌డ్జెట్ మూవీకి భారీ షాకిచ్చారు. మ‌రో.. ప‌ది రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కావాల్సిన ఓ భారీ సినిమాను హ్యాక్ చేసేయ‌టం హాట్ టాపిక్ గా మారింది.

వాల్ట్ డిస్నీ సంస్థ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించిన పైరేట్స్ ఆఫ్ ది క‌రీబియ‌న్‌-5 సినిమా ప్రింట్‌ ను హ్యాక్ చేసిన వైనాన్ని గుర్తించారు. ప్ర‌ఖ్యాత హాలీవుడ్ న‌టుడు జానీ డెప్ న‌టించిన ఈ చిత్రాన్ని రూ.2వేల కోట్ల భారీ బ‌డ్జెట్‌ తో నిర్మించారు.ఈ సినిమా ఈ నెల 25న విడుద‌ల కానుంది. తాము కోరినంత మొత్తాన్ని కానీ ఇవ్వ‌కుంటే ఈ చిత్రానికి సంబందించిన 20 నిమిషాల భాగాన్ని ఆన్ లైన్లో విడుద‌ల చేస్తామ‌ని వార్నింగ్ ఇస్తున్నారు.

ఈ విష‌యాన్ని డిస్నీ స్టూడియో సీఈవో బాబ్ ఇగ‌ర్ మీడియా స‌మావేశంలో వెల్ల‌డించారు. హ్యాక‌ర్ల బెదిరింపుల‌కు తాము త‌లొగ్గేది లేద‌ని.. డ‌బ్బులు ఇవ్వ‌టానికి తాము ఒప్పుకోలేద‌న్నారు. మ‌రింత భారీ చిత్రం ముందుగానే ఆన్ లైన్లో విడుద‌లైపోతే..? అన్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News