అన్ని ఆశలు పెట్టుకున్నావా హన్సికా?

Update: 2016-11-24 22:30 GMT
హన్సిక మొత్వాని తెలుగు సినిమాతోనే హీరోయిన్ గా కెరీర్ ఆరంభించింది. దేశముదురులో నటించి మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నా.. ఆ తర్వాత అదే జోరు తెలుగులో కంటిన్యూ చేయలేకపోయింది. తమిళ్ లో పెద్ద హీరోయిన్ స్టేజ్ కి ఎదిగినా.. తెలుగులో ఇంకా ఆపసోపాలు పడుతూనే ఉంది. చివరగా రెండేళ్ల క్రితం పవర్ మూవీలో రవితేజ సరసన రొమాన్స్ చేసిందంతే. ఆ తర్వాత సైజ్ జీరోలో చేసినా పెద్దగా స్క్రీన్ టైమ్ లేని కేమియో అది.

ఇప్పుడు గౌతమ్ నందా అనే మూవీతో మరోసారి టాలీవుడ్ ఆడియన్స్ ని పలకరించనుంది హన్సిక. గోపీచంద్ ఈ మూవీలో హీరో కాగా.. గౌతమ్-నంద అనే రెండు కేరక్టర్లలో ఈ హీరో కనిపించనున్నాడు. హన్సికతో పాటు కేథరినే థ్రెసా కూడా ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నా.. ఎక్కువగా ఆశలు పెట్టుకున్న బ్యూటీ మాత్రం హన్సికనే. సంపత్ నంది డైరెక్షన్ కావడంతో.. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు తనకు ఇది సరైన మూవీగా భావిస్తోంది హన్సిక.

ఇప్పుడీ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోగా.. చివరి రోజు షూట్ తర్వాత హన్సిక తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. మూవీలోని కొన్ని స్టిల్స్ ను కూడా ట్విట్టర్ లో షేర్ చేసి.. తన ఎక్సైట్ మెంట్ ఏ రేంజ్ లో ఉందో చూపించింది. గౌతమ్ నందలో హన్సిక కేరక్టర్ కి అటు గ్లామర్ తో పాటు ఇటు పెర్ఫామెన్స్ ను కూడా ఫుల్లుగా చూపించే ఛాన్స్ ఉంటుందట. అందుకే ఈ భామకు అంత ఆనందం అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News