గోపీచంద్ కి హన్సిక ఆక్సిజన్ పట్టిస్తుందా?

Update: 2016-07-15 07:00 GMT
గోపీచంద్ ప్రస్తుతం ఆక్సిజన్ అనే టైటిల్ పై మూవీ చేస్తున్నాడు. ఇప్పుడీ సినిమా చివరి దశకు చేరుకుంది. ఇది పూర్తి కాగానే.. గోపీచంద్ నెక్ట్స్ ప్రాజెక్ట్ కూడా కన్ఫాం అయిపోయింది.  బెంగాల్ టైగర్ తో సక్సెస్ కొట్టిన సంపత్ నందితో తన తర్వాతి పిక్చర్ చేయనున్నాడీ హీరో. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఈ సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ ని ఫారిన్ లోనే తీయనున్నారు.

ఈ మూవీలో గోపీచంద్ కి జంటగా హన్సికను ఫైనల్ చేశారని తెలుస్తోంది. చివరగా ఈమె రవితేజ సరసన పవర్ మూవీలో కనిపించింది. గోపీచంద్-సంపత్ నంది సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉండగా.. అందులో ఒక రోల్ కోసం హన్సికను సంప్రదించారని తెలుస్తోంది. అయితే లీడ్ హీరోయినా సెకండ్ హీరోయినా అనే విషయం తెలీలేదు కానీ.. దర్శకుడు చెప్పిన లైన్ కి మాత్రం హన్సిక బాగా ఇంప్రెస్ అయిందట. అందుకే డైరెక్టర్ అడిగిన విధంగా తన డేట్స్ ను అడ్జస్ట్ చేసేందుకు అభ్యంతరం లేదని చెప్పినట్లు సమాచారం.

ఇదే సినిమాలో మరో హీరోయిన్ పాత్ర కోసం కేథరిన్ థ్రెసాను అప్రోచ్ అయ్యారు. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఇంతకుముందే చెప్పేసుకున్నాం. అగ్రిమెంట్స్ కూడా అయిపోతే గోపీచంద్ కి జంటగా హన్సిక, కేథరిన్ థ్రెసాలను చూడచ్చన్న మాట.
Tags:    

Similar News