ఎట్టకేలకు హను రాఘవపూడి ట్యాలెంట్ కు తగ్గ సక్సెస్ ను దక్కించుకున్నాడు. దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా రూపొందిన సీతారామం సినిమా తో పాన్ ఇండియా స్థాయిలో కమర్షియల్ గా బిగ్గెస్ట్ సక్సెస్ ను దర్శకుడు హను రాఘవపూడి సొంతం చేసుకుని అందరిని ఆశ్చర్యపర్చాడు.
ఒకానొక సమయంలో ఈయన దర్శకత్వంలో సినిమా అంటే హీరోలు వెనకాడారు.. కానీ ఇప్పుడు ఈయన దర్శకత్వంలో సినిమా చేయాలని ఆశ పడుతున్నారట. కానీ హను రాఘవపూడి మాత్రం ప్రస్తుతం హిందీలో ఒక మల్టీ స్టారర్ సినిమాను చేసేందుకు గ్రౌండ్ ను ప్రిపేర్ చేసుకుంటున్నట్లుగా ఆయన సన్నిహితుల నుండి సమాచారం అందుతోంది.
ఒక సౌత్ దర్శకుడు.. అది కూడా హిందీలో మల్టీ స్టారర్ మూవీ అంటే కచ్చితంగా అక్కడి హీరోలు నమ్మడం అనుమానమే.. కానీ తన కథ మరియు ఇతర పాయింట్స్ తో హిందీ కి చెందిన ఇద్దరు హీరోలను ఒప్పించాడట. అతి త్వరలోనే సినిమా యొక్క పూర్తి వివరాలను వెళ్లడించబోతున్నట్లుగా హను కాంపౌండ్ నుండి సమాచారం అందుతోంది.
హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి అప్‌డేట్ అయితే లేదు. కానీ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన తదుపరి సినిమా అంతకు మించి ఉండబోతుందని.. తెలుగు వారి గురించి మరోసారి ఉత్తర భారతంలో మారు మ్రోగడం ఖాయం అన్నట్లుగా ఆ మల్టీ స్టారర్ ఉంటుందని హను సన్నిహితులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.