పవన్ కళ్యాణ్.. వెనక ముందు.. ముందు వెనక

Update: 2023-01-20 23:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇదిలా ఉంటే ఈ నెలలోనే సముద్రఖని దర్శకత్వంలో తమిళ్ హిట్ మూవీ వినోదాయ సిత్తం సినిమా రీమేక్ ని సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ఇందులో లీడ్ రోల్స్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే హరిహర వీరమల్లు సినిమా కంటే ముందుగానే ఈ మూవీని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది.

పవన్ కళ్యాణ్ ఈ మూవీ కోసం 45 డేస్ కాల్ సీట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కూడా వీలైనంత వేగంగా పూర్తి చేసి వేసవి సీజన్ లో ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి దర్శకుడు సముద్రఖని సిద్ధం అవుతున్నారు.

స్క్రిప్ట్ కూడా రెడీగా ఉండటంతో షూటింగ్ వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంది. ఇక హరిహర వీరమల్లు సినిమా ఆగష్టులో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధం అవుతుంది. అయితే షూటింగ్ ఆలస్యం అవుతూ ఉండటంతో రిలీజ్ మరింత లేట్ అయ్యే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది.

ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఇప్పటికే ఎనౌన్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఇక ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కమర్షియల్ జోనర్ లో మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ ఏడాదిలోనే ఈ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకి వచ్చే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది. ఇక దీని తర్వాత సురేందర్ రెడ్డితో సినిమా చేయాల్సి ఉంది. అయితే ఆ మూవీ ఈ ఏడాదిలో సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ అయితే ప్రస్తుతం కనిపించడం లేదు.

మొత్తానికి ఆలస్యంగా స్టార్ట్ చేస్తున్న సినిమాలని పవన్ కళ్యాణ్ ముందుగా ప్రేక్షకులకి అందిస్తూ ఉండగా ఏడాది క్రితమే మొదలైన హరిహర వీరమల్లు మూవీ మాత్రం రిలీజ్ విషయంలో వెనక్కి వెళ్ళడం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్ లో ఆసక్తికరంగా మారింది.

అయితే పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిన ఫ్యాన్స్ హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక పవన్ కెరియర్ లో చేస్తున్న మొదటి హిస్టోరికల్ బ్యాక్ డ్రాప్ మూవీ హరిహర వీరమల్లు కావడంతో దానిపై ఇంకా ఎక్కువ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News