క్రేజీ కాంబోలో భారీ ప్రాజెక్ట్‌ సెట్ట‌య్యేనా?

Update: 2022-10-19 15:30 GMT
వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన లేటెస్ట్ మూవీ `లైగ‌ర్‌`. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీ ఊహించ‌ని విధంగా డిజాస్ట‌ర్ అనిపించుకుంది. దాదాపు మూడేళ్లు శ్ర‌మించిన క‌ష్టం మొత్తం విఫ‌లం కావ‌డంతో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ‌కు గురయ్యారు. పాన్ ఇండియా వైడ్ గా భారీ విజ‌యాన్ని సాధిస్తుంద‌ని హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ భారీ ఆశ‌లు పెట్టుకున్నాడు కానీ ఈ మూవీ ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షోకే డిజాస్ట‌ర్ టాక్ ని సొంతం చేసుకుని షాకిచ్చింది.

దీంతో పూరి జ‌గన్నాథ్ డైరెక్ష‌న్ లో భారీ స్థాయిలో చేయాల‌నుకున్న `జ‌న‌గ‌ణ‌మ‌న‌` ప్రాజెక్ట్ ని ప‌క్క‌న పెట్టేశాడు. ఈ మూవీని ప‌క్క‌న పెట్టిన విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న `ఖుషీ` మూవీలో న‌టిస్తున్నాడు. ఇందులో స‌మంత హీరోయిన్. క‌శ్మీర్ తో పాటు హైద‌రాబాద్ లోనూ కీల‌క ఘ‌ట్టాల చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ మూవీ త‌దుప‌రి షెడ్యూల్ త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతోంది. స‌మంత యుఎస్ కు వెళ్లిన కార‌ణంగా ఆల‌స్యం అవుతున్నఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్‌ త్వ‌ర‌లో ప్రారంభం కాబోతోంది.

ఇదిలా వుంటే విజ‌య్ దేవ‌ర‌కొండ తో క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రారంభించాల‌ని స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడంటూ షికారు చేస్తున్నాయి. ఈ  ఇద్ద‌రు క‌లిసి రీసెంట్ గా జ‌రిగిన శివ కార్తికేయ‌న్ `ప్రిన్స్‌` మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ నేప‌థ్యంలోనే ఈ ఇద్ద‌రు క‌లిసి ఓ భారీ ప్రాజెక్ట్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని, అయితే రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ మాత్రం హ‌రీష్ శంక‌ర్ తో క‌లిసి వ‌ర్క్ చేయ‌డానికి ఆస‌క్తిని చూపించ‌డం లేద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ వార్త‌ల‌పై తాజాగా స్పందించిన హ‌రీష్ శంక‌ర్ క్లారిటీ ఇచ్చారు. తాను విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని ఒకే ఒక్క‌సారి క‌లిశాన‌ని, అయితే మా క‌ల‌యికపై మీడియా భిన్న‌క‌థ‌నాల‌ని రాయ‌డం మొద‌లు పెట్టింద‌న్నాడు.

కానీ ఇన్ సైడ్ టాక్ మాత్రం వీరిద్ద‌రి క్రేజీ కాంబో సెట్ట‌వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని, దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌నున్నాయ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. మ‌రి అంద‌రిలో ఆస‌క్తిని రేకెత్తిస్తున్నా ఈ క్రేజీ కాంబో సెట్ట‌య్యేనా అన్న‌ది తెలియాలంటే మ‌రి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News