హరీష్ ఆవేశంతో బన్నీకి డ్యామేజ్?

Update: 2017-07-07 04:01 GMT
డీజే- దువ్వాడ జగన్నాథం విషయంలో హరీష్ శంకర్ ప్రతీ విషయానికి ఊగిపోతూనే ఉన్నాడు. ఈ సినిమాలోని 'అస్మైక యోగ.. తస్మైక భోగ' సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసినపుడు విమర్శలు వస్తే.. తాను ఓ బ్రాహ్మణుడినే అంటూ బోలెడంత ఆక్రోశంతో హరీష్ శంకర్ సమాధానం ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇది డీజే రిలీజ్ కి ముందు వ్యవహారం అయితే.. తర్వాత పరిస్థితి మరింతగా శృతి మించింది.

దువ్వాడ జగన్నాథం చిత్రానికి నెగిటివ్ రివ్యూలు వచ్చిన మాట నిజమే. నిజానికి సన్నాఫ్ సత్యమూర్తి.. సరైనోడు చిత్రాలకు కూడా రివ్యూలు గొప్పగా ఏం లేవు. అయితే.. మౌత్ టాక్ బాగుండడంతో అవి విపరీతంగా అడేశాయి. కానీ డీజే విషయానికి వస్తే మౌత్ టాక్ కూడా బాలేదని ఒప్పుకోవాలి. సోషల్ మీడియాలో అయితే చీల్చి చెండాడేశారు జనాలు. మౌత్ టాక్ ను.. సోషల్ మీడియాను కంట్రోల్ చేయలేని హరీష్ శంకర్.. మీడియాను మాత్రం టార్గెట్ చేసుకున్నాడు. ప్రతీ సారి విమర్శలు గుప్పిస్తూ.. ఓవర్సీస్ లో ఈ సినిమా సరిగా పెర్ఫామ్ చేయకపోవడానికి కారణం.. మీడియానే అనేస్తున్నాడు.

ఏ రివ్యూలు ఎలా ఉన్నా.. సినిమాకు మౌత్ టాక్ అనేది ముఖ్యమైన పాయింట్. దాన్ని వదిలేసి విమర్శలు చేయడం.. ఛాలెంజ్ లు చేయడం వంటివాటి కారణంగా.. ఇప్పుడు ప్రతీసారి అల్లు అర్జున్ టార్గెట్ అయిపోతున్నాడు. బన్నీ కెరీర్ లో ఇప్పటివరకూ వినిపించని మాట ఫేక్ కలెక్షన్స్. ఆ మచ్చ కూడా ఈ ఆవేశం కారణంగానే అల్లు అర్జున్ కు అంటుకుంది అంటున్నారు అతని జెన్యూన్ అభిమానులు. ఇప్పటికీ చెప్పను బ్రదర్ కామెంట్ కారణంగా ఇబ్బంది పడుతున్న బన్నీకి.. హరీశ్ వాటం మరో తలనొప్పిగా తయారవుతోందని టాక్.
Tags:    

Similar News