తెలుగు అంధా ధున్ డైరెక్టర్ ఎవరబ్బా..?

Update: 2019-09-05 08:02 GMT
డైరెక్ట్ సినిమాలతో పోలిస్తే రీమేక్స్ సేఫ్ అని చాలామంది నిర్మాతలు నమ్ముతారు.  అందుకే ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాకు భారీ మొత్తం వెచ్చించి రీమేక్ రైట్స్ కొనుగోలు చేస్తారు. మరీ చెడగొడితేనో.. సోల్ ను మిస్ చేస్తేనో.. నేటివిటీ కనెక్ట్ కాకపోతేనో తప్ప ఎక్కువ శాతం రీమేక్ సినిమాలు విజయం సాధిస్తాయి.  అందుకే హీరో నితిన్ రీమేక్ బాట పట్టాడు.  తాజాగా నితిన్ హిందీ సూపర్ హిట్ సినిమా 'అంధా ధున్' తెలుగు రీమేక్ రైట్స్ ను రూ. 3.9 కోట్ల బారీ ధరకు సొంతం చేసుకున్నాడని సమాచారం.  

శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా.. రాధిక ఆప్టే.. టబు ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమాకు విమర్శకుల ప్రశంసలతో పాటుగా భారీ కమర్షియల్ విజయం కూడా దక్కింది.  ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో నితిన్ తన హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ పై వయాకాం 18 మోషన్ పిక్చర్స్ తో కలిసి నిర్మించేందుకు రెడీ అవుతున్నాడట.  అయితే ఈ సినిమాను తెలుగు రూపొందించబోయే దర్శకుడు ఎవరు?  ఈ సినిమాకు దర్శకుడిగా ఇద్దరు పేర్లను పరిశీలిస్తున్నారట. అందులో మొదటి పేరు హరీష్ శంకర్ కాగా మరో పేరు సుధీర్ వర్మ.  ప్రస్తుతం ఈ డైరెక్టర్లతో చర్చలు సాగుతున్నాయని త్వరలోనే ఎవరు ఈ రీమేక్ ను టేకప్ చేస్తారనే విషయం పై క్లారిటీ రానుందని సమాచారం.

నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' లో నటిస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.  ఈ సినిమా పూర్తి కాగానే 'రంగ్ దే' షూటింగ్ మొదలు పెడతాడు.  ఈ సినిమా అయిన తర్వాతే 'అంధా ధున్' రీమేక్ పట్టాలెక్కుతుందని అంటున్నారు.
Tags:    

Similar News