హరీష్ శంకర్ ‘జవాన్’ను ఎందుకు వదిలేశాడు?

Update: 2017-11-20 08:06 GMT
దర్శకుడు హరీష్ శంకర్ ‘జవాన్’ సినిమాతోనే నిర్మాత కావడానికి సన్నాహాలు చేసుకున్నాడు. ఈ చిత్రానికి మొదట అతను సమర్పకుడిగా వ్యవహరించనున్నట్లు ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఉన్నట్లుండి ఈ సినిమా నుంచి హరీష్ తప్పుకున్నాడు. మొదలైనపుడు పోస్టర్ మీద ఉన్న హరీష్ పేరు.. తర్వాత ఎగిరిపోయింది. చిత్ర నిర్మాతతో ఏమైనా విభేదాలొచ్చాయేమో.. లేక కథ నచ్చక ఈ ప్రాజెక్టు నుంచి హరీష్ బయటికి వెళ్లాడేమో అనుకున్నారంతా.

కానీ అలాంటిదేమీ లేదంటూ క్లారిటీ ఇచ్చాడు హరీష్. తనకు వీలు పడకే ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు చెప్పాడు. ఈ సినిమా మొదలయ్యే సమయానికే తాను ‘దువ్వాడ జగన్నాథం’తో బిజీ అయ్యానని.. ప్రొడక్షన్ అనేది ఒక కళ అని.. దాన్ని అందరూ చేయలేరని.. తాను దర్శకుడిగా సినిమా చేస్తూ ప్రొడక్షన్ చూసుకోవడం సాధ్యం కాదన్న ఉద్దేశంతోనే ఈ సినిమా నుంచి తాను తప్పుకుని.. దిల్ రాజును ఇందులోకి తీసుకొచ్చానని హరీష్ తెలిపాడు.

నిజాయితీతో కథ రాసిన ఏ సినిమా కూడా ఫెయిల్ కాదని.. ‘జవాన్’లో ఆ నిజాయితీ ఉంటుందని.. అదే ఈ సినిమా ప్రత్యేకత అని హరీష్ అన్నాడు. ఇప్పటిదాకా సాయిధరమ్ తేజ్ చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అని.. ఇది మరో ఎత్తు అని.. ఈ సినిమా టైటిల్.. ఇందులో సాయిధరమ్ తేజ్ పాత్ర.. అతడి పెర్ఫామెన్స్ ప్రకారం చూస్తే.. ఇది అతడి సినిమాల్లో పవన్‌ కళ్యాణ్ కు అత్యంత నచ్చే సినిమా అవుతుందని బలంగా నమ్ముతున్నానని హరీష్ చెప్పడం విశేషం.
Tags:    

Similar News