హైపర్ పేటెంట్ రైట్స్ ఇచ్చేశాను-హరీష్ శంకర్

Update: 2016-09-24 05:51 GMT
మామూలుగా తనను అందరూ హైపర్ యాక్టివ్ అంటుంటారని.. తనకు కొంచెం స్పీడెక్కువ అన్నది వాస్తవమే అని.. అందుకే హైపర్ పేటెంట్ రైట్స్ ఇన్నాళ్లూ తన దగ్గరే ఉన్నాయని.. ఐతే రామ్ ను చూశాక సగర్వంగా ఆ రైట్స్ తనకు ఇచ్చేశానని అన్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ‘హైపర్’ ఆడియో వేడుకలో మాట్లాడుతూ హరీష్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘‘కందిరీగ శ్రీనివాస్ నాకు బాగా ఇష్టమైన దర్శకుడు. అతడి స్పీడ్.. అతడి ఎనర్జీ నాకు చాలా ఇష్టం. ‘హైపర్’ చేసేముందు అతను నాకు రెండు కథలు చెప్పాడు. వీటిలో ఏది బాగుందో చెప్పమన్నాడు. ముందు హైపర్ కథ చెప్పాడు. నాకు చాలా బాగా నచ్చేసి.. ఇక రెండో కథ చెప్పొద్దు అన్నాను. రెండో కథతోనే సినిమా చేయాలనుకుంటే.. హైపర్ కథ నాకిచ్చేయమన్నాను. దీంతో వద్దులే నేనే చేస్తాను అని ఈ సినిమా చేశాడు. నేను.. శ్రీనివాస్ ఒకే తరహా వ్యక్తులం. మా స్పీడే మాకు ప్లస్. అదే మాకు మైనస్. ఐతే ఆ స్పీడ్ వల్ల కొన్ని యాక్సిడెంట్లు అవుతుంటాయి. అలాగని డ్రైవింగ్ మానేయలేం కదా. ‘హైపర్’ సినిమాలో కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ అంటూ ఓ పాట ఉంటుంది. శ్రీనివాస్ అలాగే కమ్ బ్యాక్ అవుతాడు. 14 రీల్స్ నిర్మాతలు ప్యాషన్ తో ఇండస్ట్రీలోకి వచ్చారు. మామూలుగా సినీ పరిశ్రమలోకి వచ్చి డబ్బు పేరు సంపాదించాలనుకుంటారు. ఐతే 14 రీల్స్ వాళ్లు ముందు డబ్బు సంపాదించి.. తర్వాత ఇండస్ట్రీకి వచ్చారు. యుఎస్ లో వాళ్లకున్న వ్యాపారాలకు సినిమాల్లోకి రాకపోయి ఉంటే చాలా ఎక్కువ సంపాదించేవాళ్లు. కానీ వాళ్లకు ప్యాషన్ ఉంది కాబట్టే ఇక్కడున్నారు. ఆ బేనర్లో టైం వచ్చినపుడు నేనూ ఓ సినిమా చేస్తాను’’ అని హరీష్ అన్నాడు.
Tags:    

Similar News