ఒక సినిమాను ఎంత కష్టపడి చేసినా కూడా దాన్ని సరిగ్గా ప్రమోట్ చేయలేక పోతే సరైన ఫలితం రాదు అనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం. ఆ విషయం చాలా సార్లు ప్రత్యక్షంగా మనం కూడా చూసే ఉంటాం.. స్టార్ హీరోల సినిమాల విషయంలో కూడా అది నిరూపితం అయ్యింది. రాజమౌళి సినిమాను ఎంతగా ప్రాణం పెట్టి తెరకెక్కిస్తాడో అంతే ప్రాణం పెట్టి ప్రమోట్ చేస్తాడు.
అందుకే రాజమౌళి సినిమా లు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం ను పొందుతాయి.. భారీ వసూళ్లను నమోదు చేసుకుంటాయి. కానీ కొందరు హీరోలు హీరోయిన్స్ మాత్రం సినిమాల్లో నటిస్తాం కానీ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనము.. పబ్లిసిటీ ఈవెంట్స్ అంటే మాకు చిరాకు అంటూ సినిమా యొక్క పబ్లిసిటీ కార్యక్రమాలకు దూరంగా ఉంటారు.
వారిలో ముందు ఉండే వారు నయనతార మరియు అజిత్ కుమార్. వీరిద్దరు కూడా సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో హీరోయిన్ అనే విషయం లో సందేహం లేదు. లేడీ సూపర్ స్టార్ అంటూ నయనతార కి గుర్తింపు ఉంది. ఒక్కో సినిమాకు మూడు నాలుగు కోట్ల పారితోషికం తీసుకుంటుంది. అయినా కూడా తన సినిమాను తాను ప్రమోట్ చేసేందుకు ఈమె ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదు.
మీడియా ముందుకు మాత్రమే కాకుండా కనీసం ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లేదా ఆడియో రిలీజ్ ఈవెంట్స్ లో కూడా ఈమె పాల్గొనదు. అలాగే అజిత్ కుమార్ కూడా తన సినిమాల పబ్లిసిటీ ఈవెంట్స్ లో అస్సలు కనిపించడు. అసలు పబ్లిసిటీ ప్రమోషన్ కార్యక్రమాలు అవసరం లేదు అన్నట్లుగా ఈయన నిర్మాతలతో వాదిస్తూ ఉంటాడట.
అజిత్ కి తమిళనాట టాప్ హీరో స్టార్ డమ్ ఉంది. అలాంటి టాప్ హీరో నటించిన సినిమా అంటే అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలు పెంచే విధంగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో అజిత్ పాల్గొంటే బాగుంటుంది. కానీ ఇన్నాళ్లు ఆయన పాల్గొనలేదు.. కానీ ఇక నుండి ఆయన తన సినిమాల యొక్క పబ్లిసిటీ ఈవెంట్స్ కి హాజరు అయ్యేందుకు ఓకే చెప్పాడు అనే వార్తలు వస్తున్నాయి.
ఇటీవల పెళ్లి చేసుకున్న నయనతార ప్రమోషన్స్ విషయంలో మనసు మార్చుకుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే తరహా లో అజిత్ కుమార్ కూడా ప్రమోషన్స్ విషయంలో మనసు మార్చుకుని మీడియా ముందుకు వచ్చేందుకు ఓకే చెప్పాడు అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు కనుక నిజం అయితే కచ్చితంగా తమిళ సినీ అభిమానులు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.