ఈ విష‌యంలో చిరంజీవి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారా?

Update: 2022-07-08 05:14 GMT
రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్నాక మెగాస్టార్ చిరంజీవి సినిమాల‌కే త‌న పూర్తి స‌మ‌యం కేటాయిస్తున్నారు. ఇటీవ‌ల చిరు ఆచార్య‌తో ముందుకొచ్చారు. అయితే ఈ చిత్రం అంత‌గా విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా ప‌రాజయాన్ని ప‌ట్టించుకోకుండా చిరు వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నారు.

ప్ర‌స్తుతం మెగాస్టార్ చేతిలో గాడ్ ఫాద‌ర్, వాల్తేరు వీర‌య్య‌, భోళా శంక‌ర్ చిత్రాలు ఉన్నాయి. ఇవి కాకుండా కొంద‌రు యువ ద‌ర్శ‌కుల చిత్రాల్లో న‌టించ‌డానికి కూడా చిరంజీవి క‌థ‌లు వింటున్నార‌ని టాలీవుడ్ టాక్.

కాగా చిరంజీవి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఎప్ప‌టి నుంచో ఆయ‌న‌కు ఓటీటీల్లో న‌టించాల‌ని ఉంద‌ని.. ఈ నేప‌థ్యంలో అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే ఈ ఏడాదే ఓటీటీల్లోకి మెగాస్టార్ ప్ర‌వేశించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు. ఇప్ప‌టికే ప్ర‌ముఖ న‌టులు వెంక‌టేష్, రానా ద‌గ్గుబాటి, శ్రీకాంత్, జ‌గ‌ప‌తిబాబు, రాజేంద్ర‌ప్రసాద్ ఓటీటీల్లోకి అడుగుపెట్టారు. వివిధ వెబ్ సిరీసుల్లో న‌టించారు.

ఈ నేప‌థ్యంలో చిరంజీవి కూడా మంచి క‌థా ప్రాధాన్యం ఉన్న వెబ్ సిరీస్ కోసం చూస్తున్నార‌ని చెబుతున్నారు. మంచి క‌థ దొరికితే వెబ్ సిరీస్ ల్లో చిరు నటించ‌డం ఖాయ‌మేన‌ని అంటున్నారు. ఈ విష‌యంలో చిరంజీవి మంచి ఉత్సుక‌తో ఉన్నార‌ని పేర్కొంటున్నారు.

ఇప్ప‌టికే చిన్నా, పెద్ద హీరోలు ఓటీటీల్లో న‌టించ‌డానికి మొగ్గుచూపుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే పాత‌త‌రం స్టార్ హీరోల్లో మోహ‌న్ లాల్, చిరంజీవి, ర‌జినీకాంత్ వంటి వారు ఇంకా ఓటీటీల వైపు చూడ‌టం లేదు. ఈ నేప‌థ్యంలో వారంద‌రి కంటే ముందే చిరంజీవి ఓటీటీల్లో న‌టించ‌డానికి మొగ్గుచూపుతున్నార‌ని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీలోకి ఎంటర్ అవుతున్న తొలి స్టార్ హీరోగా చిరంజీవి సరికొత్త రికార్డు నెలకొల్పాలనుకుంటున్నారట. ఈ క్రమంలో చిరు మంచి వెబ్ సిరీస్ కోసం చూస్తున్నార‌ని టాలీవుడ్ టాక్.

ఈ నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా పేరున్న‌ రెండు దిగ్గజ ఓటీటీ సంస్థలు ఇప్పటికే చిరును సంప్రదించారని చెబుతున్నారు. ఓ భారీ వెబ్ సిరీస్ కోసం వారు చిరును ఒప్పించారని తెలుస్తోంది. క‌థ న‌చ్చితే తనకు అభ్యంతరం లేదని చిరు చెప్పారని కూడా స‌మాచారం.
Tags:    

Similar News