ఇంకో నాలుగు రోజుల్లో తన మూడో సినిమా మిస్టర్ మజ్ను రూపంలో పలకరించబోతున్నాడు అఖిల్. అభిమానులను మినహాయిస్తే సాధారణ ప్రేక్షకుల్లో మరీ ప్రత్యేకమైన అంచనాలు లేవు కానీ బాగుంది అనే టాక్ వస్తే తొలిప్రేమ తరహాలో హిట్ కొట్టొచ్చనే అభిప్రాయాలు గట్టిగానే ఉన్నాయి. అయితే ట్రైలర్ లో రామ్ చరణ్ ఆరంజ్ ఛాయలు ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్స్ జోరుగానే వినిపించాయి. అమ్మాయిలను ఫ్లర్ట్ చేసే హీరో తర్వాత హీరోయిన్ నిజమైన ప్రేమలో పడటం అనే పాయింట్ లో కొత్తదనం లేదు.
అయితే సరిగ్గా చూపించాలే కానీ ప్లే బాయ్ పాత్రలు యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి. ప్రేమ్ నగర్ లో అక్కినేని నాగేశ్వర్ రావు మొదలుకుని మజ్ను-మురళీకృష్ణుడు లాంటి సినిమాల్లో నాగార్జున దాకా వీటి ద్వారానే మెప్పించారు. ఇప్పుడు అఖిల్ వంతు వచ్చింది. ట్రైలర్ లో గమనిస్తే లుక్స్ పరంగా యాక్టింగ్ పరంగా మెచ్యూరిటీ కనిపిస్తోంది. తమన్ మ్యూజిక్ కి మంచి ఫీడ్ బ్యాక్ కూడా వచ్చింది.
అయితే ఫ్యాన్స్ సెంటిమెంట్ పరంగా మిస్టర్ మజ్ను మీద ఆశలు పెట్టుకున్నారు. తాత ఏఎన్ఆర్ 1949లో లైలా మజ్ను చేస్తే అప్పట్లో అది పెద్ద హిట్. పాటలు చిరస్ధాయిగా నిలిచిపోయాయి. నాన్న 1987లో దాసరి దర్శకత్వంలో మజ్ను చేస్తే అదీ బంపర్ హిట్. ఇది తొలి రాత్రి అనే పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఇప్పుడు మూడో తరం మజ్నుగా అఖిల్ వస్తున్నాడు. సో ఇది కూడా వాటి తరహాలోనే ఖచ్చితంగా ఆడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. 25న మణికర్ణిక తప్ప పోటీ లేదు కాబట్టి ఈ అవకాశాన్ని సరిగ్గా వాడుకుంటే అఖిల్ కు సాలిడ్ హిట్ దొరికినట్టే. అయితే అది పూర్తిగా కంటెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. వెంకీ అట్లూరి ఎలా డీల్ చేసాడో మరి ఇంకో నాలుగు రోజులు ఆగి చూస్తే తెలుస్తుంది