తాజాగా క్రికెటర్ యువరాజ్ సింగ్ పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. బ్రిటిష్ భామ హాజెల్ కీచ్ ను వివాహమాడాడు యువరాజ్. ఈమె బాలీవుడ్ తో టాలీవుడ్ జనాలకు పరిచయం ఉన్న బ్యూటీనే. బాలీవుడ్ మూవీ బాడీగార్డ్ లో సపోర్టింగ్ రోల్ చేయడంతో పాటు.. టాలీవుడ్ మూవీ కృష్ణం వందే జగద్గురుంలో ఓ ఐటెం సాంగ్ కూడా చేసింది.
అయితే.. ఈమె బ్రిటిష్ మారిషన్ కావడంతో.. యువరాజ్ ను మ్యారేజ్ చేసుకునేందుకు పేరు మార్చుకోవాల్సి వచ్చింది. పెళ్లికి ముందు గురుద్వారాకు వెళ్లి తన పేరును హాజెల్ కీచ్ నుంచి 'గుర్బసంత్ కౌర్' గా మార్చుకుంది. ఈమె పేరును గురుద్వారాలో అనౌన్స్ చేశాకే యువరాజ్ తో ఈమె పెళ్లి జరిగింది. ఇలా పేరు మార్చుకుని పెళ్లి చేసుకున్న వారు మరికొందరు సెలబ్రిటీలు ఉన్నారు.
సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా రీసెంట్ గా తాను మూడోసారి పేరు మార్చుకున్నాడనే విషయాన్ని ఖండించాడు. ఇతను అప్పట్లో తన పెళ్లి కోసం అబ్దుల్ హలీఖ్ పేరు మార్చుకున్న యువన్.. తిరిగి మరోసారి మతం మారుతున్న విషయాన్ని ఖండించాడు. 'నేను ఇస్లాంనే ఫాలో అవుతున్నా.. అందుకు గర్విస్తున్నా. నా కుటుంబం నా నిర్ణయాన్ని సపోర్ట్ చేసింది' అంటూ స్వయంగా చెప్పాడు ఈ కంపోజర్.
బెంగాలీ బ్యూటీ అలనాటి హీరోయిన్ షర్మిలా టాగూర్ కూడా పెళ్లి కోసం పేరు మార్చుకుంది. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీని 1969లో పెళ్లి చేసుకున్న ఈమె.. అయేషా సుల్తానా ఖాన్ గా మారి.. పెళ్లి చేసుకుంది. వీరి కొడుకే ఇప్పటి బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/