ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ 2022 పాన్ ఇండియా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ వాయిదాతో ఎలాంటి పరిస్థితులు తలెత్తాయో తెలిసిందే. జనవరి 7న రిలీజ్ అవ్వాల్సిన సినిమా వాయిదా పడింది. కరోనా కొత్త వేరియెంట్ ఓమిక్రాన్ భయంతోనే దర్శకుడు రాజమౌళి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సినిమా ప్రచారం కోసం ఖర్చు పెట్టిన ప్రతీ రూపాయి బూడిదలో పోసిన పన్నీరే అయింది. జనవరి 7న థియేటర్లోకి వచ్చేస్తాం అన్న ధీమాతో రాజమౌళి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు ప్లాన్ చేసి ముందుకెళ్లిన సంగతి తెలిసిందే. దేశంలోనే ప్రధాన మెట్రో నగరాల్ని టార్గెట్ చేసి టీమ్ సభ్యులు అక్కడికి వెళ్లి పెద్ద ఎత్తున సినిమాకి ప్రచారం కల్పించారు.
ముంబై..చెన్నై...బెంగుళూరు..ఢిల్లీ ఇలా మెట్రోపాలిటన్ నగరాల్లో ఎక్కడికక్కడ వేర్వేరుగా ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ...దర్శకధీరుడు రాజమౌళి స్వయంగా హాజరై వేడుకని సక్సెస్ చేసారు. ఇక బాలీవుడ్ మార్కెట్ కీలకంగా భావించి అక్కడ 50కి పైగా ఇంటర్వ్యూల్లో ఈ త్రయం పాల్గొంది. ట్రౌఐలర్ రిలీజ్ దగ్గర నుంచి ప్రీ రిలీజ్ వరకూ ఈ ముగ్గురు క్షణం తీరిక లేకుండా ప్రచారం కోసమే సమయం కేటాయించి పనిచేసారు. ప్రచారం కోసం భారీగా బడ్జెట్ కటాయించారని నిర్మాణ వర్గాల నుంచి తాజాగా లీకైంది.
ప్రత్యేకంగా ఈ ముగ్గురి కోసం చార్టర్డ్ ప్లైట్.. ఖరీదైన హోటల్స్ లో బస..ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఖర్చు..స్పెషల్ ఈవెంట్స్ ఖర్చు అన్ని కలిపి తడిపిమోపుడైందని సమాచారం. దాదాపు 15 కోట్ల వరకూ ఖర్చు చేసినట్లు ప్రొడక్షన్ హౌస్ సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ఇన్ని కోట్లు ఖర్చు చేసి సినిమాకి ఓ రేంజ్ లో బజ్ తీసుకొచ్చారు. కానీ రిలీజ్ వరకూ ఆ బజ్ సినిమాపై నిలబడదు. పైగా సినిమా వాయిదా పడితే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ తగ్గిపోతుంది. మళ్లీ ఆ రెయిజింగ్ ని తీసుకురావడం కష్టమైన పని. మరి రాజమౌళి తదుపరి ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారో చూద్దాం.