ఈ ఇయర్ కి ఇది పర్ఫెక్ట్ ఎండ్

Update: 2016-12-20 05:09 GMT
ఈ వారం రిలీజ్ అయిన నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ మూవీ.. మంచి కలెక్షన్స్ దూసుకెళ్తోంది. డివైడ్ టాక్ సంగతి ఎలా ఉన్నా.. వసూళ్లను  సాధించడంలో మాత్రం హీరోయిన్ హెబ్బా పటేల్ కి వరుసగా నాలుగో హిట్ వచ్చేసిందని అందరూ అంటున్నారు. దీంతో మూవీ యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది.

'మొదటి సినిమాకే సక్సెస్ ఇచ్చినందుకు ఉత్తరాంధ్ర అంతా తిరిగి థ్యాంక్స్ చెప్పబోతున్నాం అని చెప్పాడు' దర్శకుడు భాస్కర్ బండి. 'రావు రమేష్ గారి కేరక్టర్ అద్భుతం. మొదటి రోజు డల్ గా ఉన్నా.. డిమానిటైజేషన్ కారణంగా డబ్బులు తక్కువగా ఉన్నా.. తర్వాత వసూళ్లు విపరీతంగా వచ్చాయి'  అన్నాడు సినిమాలో ఒక హీరోగా నటించిన అశ్విన్.

'లెజెండరీ డీఓపీ చోటాకె నాయుడు గారిని అందరినీ అద్భుతంగా చూపించార'న్నాడు పార్వతీశం. 'సక్సెస్ మీట్ లో మాట్లాడాలని అనుకున్న కోరిక ఇన్నాళ్లకు తీరింది. ఇక హెబ్బా అయితే వరుస సక్సెస్ లతో దూసుకుపోతూనే ఉంటుంది.. డీమానిటైజేషన్ ఎఫెక్ట్ సినిమాపై కనిపించకపోవడం సంతోషంగా ఉంది' అన్నాడు నోయల్.

'అందరూ నాపై ఎంతో ప్రేమ చూపించారు. మీడియా దగ్గర నుంచి ఆడియన్స్ వరకూ అందరూ నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఈ ఇయర్ కి నాకు ఇది పర్ఫెక్ట్ ఎండ్. అనుకుంటున్నాను' అంటూ హేభా పటేల్ తన ఆనందాన్ని వెలిబుచ్చింది. 'ఫస్ట్ డే కంటే సెకండ్ డే గ్రాస్ పెరిగింది. సెకండ్ డే కంటే థర్డ్ డే గ్రాస్ డబుల్ అయింది. మౌత్ టాక్ ద్వారా సినిమా వసూళ్లు పెరుగుతున్నాయి. ఇండస్ట్రీలో అందరూ మంచి సినిమా తీశావని అభినందిస్తున్నార'ని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ అన్నారు.

'ఒక్క అమ్మాయి ఒకేసారి ముగ్గురు అబ్బాయిలను ప్రేమించాలని అనే కాన్సెప్ట్ ని దర్శకుడు ఒప్పించిన తీరు అద్భుతం' అంటూ నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ మూవీ యూనిట్ ని పొగిడారు యాక్టర్ కం కంపోజర్ అయిన ఆర్పీ పట్నాయక్.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News