గాడ్‌ ఫాదర్ తో పోటీ పై ది ఘోస్ట్‌ ఏమన్నాడంటే..!

Update: 2022-09-19 06:35 GMT
ఈ దసరా కి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతున్న విషయం తెల్సిందే. మంచి స్నేహితులు అయిన మెగా స్టార్‌ చిరంజీవి మరియు కింగ్‌ నాగార్జున లు నటించిన గాడ్ ఫాదర్ మరియు ది ఘోస్ట్‌ సినిమాలు ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అక్టోబర్ 5వ తారీకున విడుదల కాబోతున్న ఈ సినిమా ల యొక్క సందడి మొదలయ్యింది.

మెగాస్టార్‌ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేయలేదు.. కానీ నాగార్జున ఇప్పటికే ది ఘోస్ట్‌ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేయడం జరిగింది. తప్పకుండా ఈ రెండు సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకుంటాయనే నమ్మకంతో మెగా మరియు అక్కినేని అభిమానులు ధీమాతో ఉన్నారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవితో బాక్సాఫీస్‌ ఫైట్‌ గురించి నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ది ఘోస్ట్‌ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నాగార్జున మాట్లాడుతూ... దసరా సీజన్‌ లో రెండు మూడు సినిమాలు రావడం కొత్తేం కాదు. దసరా సీజన్ లో ఎన్ని మంచి సినిమాలు వచ్చినా కూడా ప్రేక్షకులు ఆధరిస్తూనే ఉంటారు. తప్పకుండా ఈసారి కూడా ప్రేక్షకుల ఆదరణ ఉంటుందనే నమ్మకం వ్యక్తం చేశాడు.

చిరంజీవి గారి సినిమాల కోసం చాలా మంది వెయిట్‌ చేస్తూ ఉంటారు. ఆయన సినిమా కోసం నేను కూడా వెయిట్‌ చేస్తూనే ఉంటాను. మా ఇద్దరి సినిమాలు ఒకేసారి విడుదల కాబోతున్న నేపథ్యంలో నేను చాలా ఆసక్తిగా రెండు సినిమాల కోసం వెయిట్‌ చేస్తున్నాను. మా రెండు సినిమాలు ఒకే సారి విడుదల అయినంత మాత్రాన నష్టం జరుగుతుందని తాను భావించడం లేదని నాగార్జున అన్నాడు.

సినిమా బాగుండాలే కానీ పోటీ అనేది అస్సలు మ్యాటర్‌ కాదు. ఒకే రోజు రెండు మూడు సినిమాలు వచ్చి అవి మొత్తం సక్సెస్ అయితే మంచి వసూళ్లు నమోదు అయిన దాఖలాలు ఉన్నాయి అన్నట్లుగా నాగార్జున అభిప్రాయం వ్యక్తం చేశాడు. తప్పకుండా మా రెండు సినిమాలు కూడా భారీ విజయాలను సొంతం చేసుకుంటాయనే నమ్మకంను వ్యక్తం చేశారు.

టాలీవుడ్‌ వర్గాల వారితో పాటు ప్రేక్షకులు ఈ ఆసక్తికర పోటీ ని ఉత్కంఠభరితంగా గమనిస్తూ ఉన్నారు. మరి రెండు సినిమాల్లో ఏ సినిమా హిట్ అయ్యేను.. ఈ సినిమా ఫట్‌ అయ్యేను అంటూ ఇప్పటికే కొందరు చర్చలు మొదలు పెట్టారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News