అడివి శేష్ అలాంటి సినిమాలు త‌ప్ప వేరేవి చెయ్య‌లేడా?

Update: 2023-01-10 17:00 GMT
అడివి శేష్‌.. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో వున్న క్రేజీ హీరోల్లో ప్ర‌ముఖంగా వినిపిస్తున్న పేరిది. `క‌ర్మ` సినిమాతో హీరోగా, ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్ కు ప‌రిచయ‌మైన ఈ యంగ్ టాలెంటెడ్ హీరో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన `పంజా` మూవీతో టాలీవుడ్ లో పాపుల‌ర్ అయ్యాడు. ఆ త‌రువాత రాజ‌మౌళి `బాహుబ‌లి`లో న‌టించే అవ‌కాశాన్ని ద‌క్కించుకుని మ‌రింతగా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ త‌రువాత త‌న‌కు టాలీవుడ్ లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ల నుంచి బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ఆఫ‌ర్లు ల‌బించాయి.

`క్ష‌ణం`తో రైట‌ర్‌గా, హీరోగా స‌క్సెస్ ని సొంతం చేసుకున్న అడివి శేష్ అప్ప‌టి నుంచి త‌న ప్ర‌తీ సినిమాకు అదే పంథాని అనుస‌రిస్తూ స్టోరీస్ లో ఇన్ వాల్వ్ అవుతూ బ్యాక్ టు బ్యాక్ స‌క్సెస్ ల‌ని త‌న ఖాతాలో వేసుకుంటూ వ‌స్తున్నాడు. `క్ష‌ణం`తో మొద‌లైన అడివి శేష్ స‌క్సెస్ ప‌రంప‌ర రీసెంట్ గా విడుద‌లైన `హిట్ 2 ` వ‌ర‌కు కొన‌సాగుతూనే వుంది. ఈ సినిమాతో డ‌బుల్ హ్యాట్రిక్ హిట్ ని సొంతం చేసుకున్న హీరోగా అరుదైన ఘ‌న‌త‌ని సాధించాడు.

త్వ‌ర‌లో `గూఢ‌చారి 2`తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌లే మొద‌లైంది. `మేజ‌ర్‌` మూవీతో పాన్ ఇండియా స‌క్సెస్ ని సొంతం చేసుకున్న అడివి శేష్ అదే పంథాలో `గూఢ‌చారి 2`తో కూడా పాన్ ఇండియా వైడ్ గా ప్ర‌క్ష‌కుల్ని ఆక‌ట్టుకోవాల‌నే ప్ర‌య‌త్నాల్లో వున్నాడు. ఈ మూవీ కూడా తెలుగుతో పాటు ఐదు భాష‌ల్లోనూ రిలీజ్ కానుంది. ఇదిలా వుంటే అడివి శేష్ పై స‌రికొత్త కామెంట్ లు వినిపిస్తున్నాయి.

అడివి శేష్ ఎప్పుడూ పోలీస్‌, గూఢ‌చారి, ఏజెంట్ లాంటి సినిమాలు, రోల్స్ త‌ప్పా నార్మ‌ల్ సినిమాలు చేయ‌డా?.. చేయ‌లేడా?..త‌న స్ట్రెంత్ ఏ క్యారెక్ట‌ర్ లు, స్క్రిప్ట్ ల‌కు స‌రిపోతుందో అలాంటివే అడివి శేష్ ఇంత వ‌ర‌కు ట్రై చేస్తున్నాడా?.. సూప‌ర్ హిట్ లు ఇచ్చినా త‌ను హీరోగా, నటుడిగా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ల‌డా?.. నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాలంటే అన్ని ర‌కాల సినిమాలు చేయాలి. హాలీవుడ్ హీరోలా అవ్వేచేస్తాడా? హ‌లీవుడ్ స్టార్ అవ్వొచ్చు కానీ టాలీవుడ్ లో స్టార్ హీరో అవ్వాలంటే మాస్ మ‌సాలా సినిమాలు కూడా చెయ్యాలి అని అంటుంటారు. చూద్దాం అదివి శేష్ ఆ మాట త‌ప్ప‌ని, అందుకు నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చూపిస్తాడేమో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News