ప్రిన్స్ మహేశ్ బాబు అప్ కమింగ్ మూవీ స్పైడర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా తమిళ దర్శకుడు, హీరో ఎస్.జె.సూర్య నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇందులో మరో విలన్ గా బాయ్స్ ఫేమ్, తమిళ హీరో భరత్ నటిస్తున్నాడు. అయితే, తాను కేవలం ఈ ఒక్క సినిమాలో మాత్రమే విలన్ గా కనిపిస్తానని తేల్చి చెప్పేశాడు భరత్. సినిమాలో తన పాత్ర గురించి ఓ ఇంటర్వ్యూలో భరత్ అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
స్పైడర్ షూటింగ్ మొదలైన పది రోజులకు డైరెక్టర్ మురుగదాస్...భరత్ కు ఫోన్ చేసి స్క్రిప్ట్ చెప్పారట. నేరుగా తెలుగులో నటించడం , అందులోనూ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు చిత్రంలో నటించే అవకాశం రావడంతో విలన్ పాత్ర అయినా వెంటనే ఓకే చెప్పేశాడట. అయితే, ఈ చిత్రానికి తెలుగు డబ్బింగ్ చెప్పడంలో ప్రిన్స్ చాలా హెల్ప్ చేశాడట. మహేశ్, మురుగదాస్ ఎంతో ఓపిగ్గా భరత్ చేత డైలాగులు చెప్పించారట.
ఈ సినిమాలో భరత్ , మహేశ్ ల మధ్య ఓ రోలర్ కోస్టర్ పై ఫైటింగ్ సీన్ ఉందట. ఫైట్ మాస్టర్ పీటర్ హీన్స్15 రోజుల పాటు చిత్రీకరించిన ఆ ఫైట్ సీన్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందట. స్పైడర్ చిత్రం తన కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుందని భరత్ అంటున్నాడు. అయితే, ఈ సినిమా తర్వాత విలన్ పాత్రల్లో నటించే అవకాశం వస్తే కచ్చితంగా చేయననే చెప్పేస్తాడట. తాను ఎప్పటికైనా హీరోగా రాణించడానికే ఇష్టపడతానని భరత్ అంటున్నాడు.