సినిమా హీరో.. ఈ సౌండ్ వినగానే వాళ్లకేవో అద్భుత శక్తులు ఉంటాయేమో అన్న ఫీలింగ్ సహజంగానే వచ్చేస్తుంది. మన సినిమాల్లో హీరోల కేరక్టర్స్ అలాగే ఉంటాయ్ మరి. ఓ చెయ్యి విసిరితే.. పది మంది రౌడీలు గాల్లోకి ఎగిరిపోయే సీన్స్ చూసీచూసీ అలా అలవాటయిపోయింది. ఆ తర్వాత నిజంగానే పవర్స్ ఉండే కేరక్టర్స్ తో సినిమాలొచ్చాయి.
అయితే ఇవన్నీ స్టార్ హీరోలకే చెల్లుబాటవుతాయి. పాపం కుర్ర హీరోలకు ఇలా కుదరదు సరికదా.. శారీరక లోపాలు, రోగాలు తెచ్చి తగిలిస్తున్నారు డైరెక్టర్లు. కొన్నాళ్ల క్రితం విశాల్ హీరోగా ఇంద్రుడు అనే మూవీ వచ్చింది. ఇందులో హీరోకి నార్కొలెప్సీ.. అంటే నిద్రపోయే రోగం ఉంటుంది. ఆనందం, బాధ, టెన్షన్.. ఇలా ఏమొచ్చినా నిద్రపోవడం విశాల్ కేరక్టర్ కి ఉండే రోగం.
టాలీవుడ్ కుర్రహీరో నిఖిల్ సూర్య వర్సెస్ సూర్య అనే సినిమాలో.. ఓ వెరైటీ రోల్ పోషించాడు. సూర్యకాంతి ఒంటిమీద పడకూడని రోల్ ఇది. అందుకే సినిమాలో చాలా భాగం రాత్రిపూటే ఉంటుంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. నాని గురించి చెప్పాలి. షార్ట్ టెర్మ్ మెమరీ లాస్.. సింపుల్ గా చెప్పాలంటే మతిమరుపు కం అటెన్షన్ డైవర్షన్ అన్నమాట. ఈ పాత్రను అద్భుతంగా పోషించి.. మూవీని బ్లాక్ బస్టర్ చేసేశాడు నాని. ముందు రెండు సినిమాలు కాస్త పర్వాలేదనిపించాయంతే.
ఇలా కుర్రహీరోలను రోగాలపాలు చేస్తున్నారు డైరెక్టర్లు. కాకపోతే ఈ ట్రెండ్ కి నాంది పలికింది మాత్రం తమిళ స్టార్ హీరో సూర్య. గజిని చిత్రంలో పావుగంటకే అన్నీ మర్చిపోయే రోల్ తో కోలీవుడ్ - టాలీవుడ్ లలో బ్లాక్ బస్టర్స్ సాధించాడు. అలా రోగాలు కూడా సినిమాల విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాయన్నమాట.