ఈ నెల 19న విడుదల కానున్న లయన్ కింగ్ మూవీ మీద అంచనాలు మాములుగా లేవు. పేరుకే హాలీవుడ్ మూవీ కానీ సౌత్ లోనూ మన సినిమాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ సూపర్ హిట్ అయ్యింది. ఒక్కో భాషకు స్టార్లను సెట్ చేసుకుని మరీ డబ్బింగ్ చెప్పించడంతో లయన్ కింగ్ మీద ఆయా అభిమానుల చూపు కూడా పడటంతో అంచనాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నాని డబ్బింగ్ చెప్పిన సింబా తాలూకు వీడియో ప్రోమోను విడుదల చేశారు డిస్నీ పిక్చర్స్.
నాని డబ్బింగ్ స్టూడియోలో వాయిస్ ఇవ్వడం చూపించి ఆ తర్వాత లయన్ కింగ్ సన్నివేశాల్లో నేను సింబా ముఫాసా కొడుకుని అంటూ అంటూ న్యాచురల్ స్టార్ గాత్రం ఉన్న క్లిప్ ని అందులో పొందుపరిచారు. ఈ వీడియోని నాని స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేశాడు. నానితో పాటు జగపతి బాబు-రవి శంకర్-బ్రహ్మానందం-ఆలీ డబ్బింగ్ చెప్పిన లయన్ కింగ్ పాత రికార్డులు బ్రేక్ చేస్తుందన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
ఇటీవలి కాలంలో మన స్టార్లు క్రేజీ ఇంగ్లీష్ మూవీస్ కి డబ్బింగ్ చెప్పడం పెరుగుతోంది. ఈ మధ్యే అల్లాయుద్దీన్ కు వెంకటేష్ వరుణ్ తేజ్ లు మాటలు చెప్పడం పెద్ద ప్లస్ అయ్యింది. జగపతిబాబు గతంలో ఓ సినిమాకు చెప్పాడు. కానీ నానికి మాత్రం ఇది కొత్త అనుభవం. వర్క్ అవుట్ అయ్యిందా ఇదే వరసలో మన తారలు ఇకపై డబ్బింగ్ చెప్పడాన్ని అలవాటుగా చేసుకుంటారేమో చూడాలి
Full View