హీరోలు కేవలం తమ పాత్రలకే పరిమితమయ్యే రోజులు పోయాయి. సినిమా మేకింగ్ లో హీరోల డామినేషన్ ఎప్పుడైతే మొదలైందో.. అప్పటి నుంచి ప్రొడక్షన్ వైపు కూడా వీరి అడుగులు పడ్డాయి. ప్రస్తుతం స్టార్ హీరోల్లో దాదాపు అందరికీ ప్రొడక్షన్ హౌస్ లు ఉన్నాయంటే.. నిర్మాణంపై హీరోల ఆసక్తి ఏ స్థాయికి చేరిందో అర్ధమవుతుంది.
అలనాటి సీనియర్లు చూపించిన బాటను ఇప్పుడు కుర్ర హీరోలు కూడా ఫాలో అయిపోతున్నారు. డిఫరెంట్ మూవీస్ ను తన స్టైల్ లో చేస్తూ.. రెగ్యులర్ పాత్రలను డిఫరెంట్ గా చేసి మెప్పించేయగలడు నేచురల్ స్టార్ నాని. ఇప్పుడీ హీరో కూడా ప్రొడ్యూసర్ గా మారబోతున్నాడని తెలుస్తోంది. అయితే.. నిర్మాతగా తన పేరు వేసుకునే బదులు.. తన బంధువులతో కలిసి ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తాడట. అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్ లో తీయబోయే సినిమా.. నాని స్టార్ట్ చేసే బ్యానర్ లో తెరకెక్కే మొదటి మూవీ అంటున్నారు.
నాని చూపించే స్పీడ్ కి.. సాధించే సక్సెస్ లకు బోలెడంత మంది నిర్మాతలు క్యూలో ఉండగా.. తనే ప్రొడ్యూసర్ గా మారడం ఎందుకో అనిపించడం సహజమే. మనీ మ్యాటర్స్ సంగతి పక్కన పెడితే.. యాక్టర్ గా మరింత భిన్నమైన సినిమాలు చేయాలంటే ప్రయోగాలు చేయాల్సి ఉండడంతో.. ఆ రిస్క్ తీసుకునేందుకు నాని రెడీ అయ్యాడని.. అందుకే ఈ ఆలోచన చేశాడని సన్నిహితులు చెప్పుకుంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/