రామ్‌ చరణ్‌ మాదిరిగా నా కూతుర్లు

Update: 2019-06-25 08:11 GMT
రాజశేఖర్‌ హీరోగా రూపొందిన 'కల్కి' చిత్రం ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌ ను తాజాగా విడుదల చేయడం జరిగింది. ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులతో పాటు జీవిత ఇంకా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాజశేఖర్‌ మాట్లాడుతూ సినిమాపై తనకున్న నమ్మకంను వ్యక్తం చేశాడు. తన కెరీర్‌ లో ప్రవీణ్‌ సత్తారు మరియు ప్రశాంత్‌ వర్మలు చాలా కీలకం అన్నాడు.

రాజశేఖర్‌ ఇంకా మాట్లాడుతూ.. ఈ చిత్రంకు నిర్మాత సి కళ్యాణ్‌ ఇచ్చిన బడ్జెట్‌ లో పూర్తి చేసేందుకు జీవిత చాలా కష్టపడింది. ఈ సినిమా కోసం నా కూతుర్లు కూడా బాగా కష్టపడ్డారు. గరుడవేగ చిత్రం స్థాయిని బీట్‌ చేయాలని ప్రశాంత్‌ వర్మకు నేను మొదట్లో చెప్పాను. గరుడవేగ స్థాయిని రీచ్‌ అయినా కూడా సక్సెస్‌ అయినట్లే అనుకుంటున్నాము. ఈ ఇద్దరు యంగ్‌ దర్శకుల నుండి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. గరుడవేగతో పోల్చితే ఇది పూర్తి విరుద్దంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

ఈ కార్యక్రమంలోనే చిరంజీవి గారి అబ్బాయి రామ్‌ చరణ్‌ తండ్రి సినిమాలను ప్రొడ్యూస్‌ చేస్తున్నారంటూ జర్నలిస్ట్‌ ప్రశ్నించేందుకు ప్రయత్నించగా తనకు ఒక కొడుకు ఉంటే నాతో సినిమా చేసేవాడని.. అయినా నా కూతుర్లు కూడా ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారని అన్నాడు. చరణ్‌ మాదిరిగా తన కూతుర్లు కూడా తనతో సినిమా తీస్తారని రాజశేఖర్‌ ఉద్దేశ్యం. రాజశేఖర్‌ సినిమా నిర్మాణ వ్యవహారం నుండి అన్ని విషయాల్లో కూడా ఇద్దరు కూతుర్ల ఇన్వాల్వ్‌ మెంట్‌ ఉంటుందట. ప్రస్తుతం ఇద్దరు హీరోయిన్స్‌ గా నటిస్తున్నా కూడా వీలు చిక్కినప్పుడల్లా నాన్న సినిమాకు వర్క్‌ చేశారట.

Tags:    

Similar News