యంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా 'అ!' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కల్కి'. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 28 న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా రాజశేఖర్ ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రేక్షకులను థియేటర్ కు వచ్చి 'కల్కి' ని చూడాలని.. టీవీలలో వచ్చిన తర్వాత చూడాలనే ఆలోచన వద్దని ఒక రిక్వెస్ట్ చేశారు.
రాజశేఖర్ లాస్ట్ సినిమా 'PSV గరుడవేగ' కు మంచి పేరు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా మంచిదని అందరూ అన్నారు కానీ కలెక్షన్స్ విషయంలో మాత్రం 'గరుడవేగ' బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఆ సినిమాకు ముందు రాజశేఖర్ వరస ఫెయిల్యూర్స్ లో ఉండడంతో ఆ ఎఫెక్ట్ 'గరుడ వేగ' కలెక్షన్స్ పై కనిపించింది . ఆ సినిమాను నిర్మించిన రాజశేఖర్ కు పెద్దగా మిగిలిందేమీ లేదు. కాస్ట్ ఫెయిల్యూర్ అయిందనే టాక్ కూడా వినిపించింది. కానీ అదే సినిమాను టీవీల్లో ప్రసారం చేసినప్పుడు.. డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ భారీ రెస్పాన్స్ దక్కింది. ఈ ప్రేక్షకులు కనుక థియేటర్లలో చూసి ఉంటే 'గరుడవేగ' ప్రాఫిటబుల్ వెంచర్ గా నిలిచి ఉండేది.
ఇప్పుడు 'కల్కి' సినిమాను కూడా రాజశేఖర్ స్వయంగా నిర్మించారు. ఈ సినిమాకు ముందుగా అనుకున్నదానికంటే బడ్జెట్ ఎక్కువైందని.. 'గరుడవేగ' కంటే బడ్జెట్ ఎక్కువ ఖర్చు అయిందని ఆయన వెల్లడించారు. పెట్టుబడి రికవర్ కావాలంటే థియేట్రికల్ కలెక్షన్స్ కావాలి కదా? అందుకే టీవీల్లో వచ్చేవరకూ ఆగకుండా థియేటర్ కు వచ్చి చూడాలని రాజశేఖర్ ప్రేక్షకులను కోరారు. మరి రాజశేఖర్ అభ్యర్ధనను ఎంతమంది పట్టించుకుంటారో.. 'కల్కి' కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి.