హైపర్ హీరోతో ఇజం డైరెక్టర్

Update: 2016-11-06 11:30 GMT
దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇప్పుడు కుర్రాళ్లపై కాన్సంట్రేషన్ చేస్తున్నాడు. స్టార్ హీరోలతో సినిమాల విషయంలో తన రేంజ్ నిరూపించుకోవడంలో తడబడుతున్న పూరీ.. యంగ్ హీరో కళ్యాణ్ రామ్ తో చేసిన ఎంటెంప్ట్ ఫెయిల్ అయింది. ఇజం మూవీ సబ్జెక్ట్ విషయంలో మంచి మార్కులు వేయించుకున్నా.. కళ్యాణ్ రామ్ మేకోవర్ కి మంచి రెస్పాన్స్ వచ్చినా.. అవన్నీ ఓపెనింగ్స్ కి తప్ప సినిమాకు ఉపయోగపడలేదు.

మరోవైపు హైపర్ మూవీతో హీరో రామ్ డీలా పడ్డాడు. ఎనర్జిటిక్ హీరోగా తనకున్న ఇమేజ్ ను కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. నేను శైలజతో ట్రాక్ లోకి వచ్చినట్లే వచ్చి మళ్లీ హైపర్ దగ్గర బోల్తా కొట్టాడు. ఇటు పూరీకి.. అటు రామ్ కి ఇద్దరికీ హిట్ కొట్టాల్సిన అవసరం ఏర్పడింది. పూరీతో ప్రాజెక్టు విషయంలో రామ్ ఉత్సాహం చూపుతున్నడని తెలుస్తోంది. ముఖ్యంగా గెటప్ విషయంలోను రొటీన్ విషయంలోనూ రామ్ పై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో పూరీతో సినిమా చేస్తే.. తనకు మేకోవర్ తెచ్చిపెడతాడని అనుకుంటున్నాడట రామ్.

ఈ సిట్యుయేషన్ లో పూరీ-రామ్ లు ఇప్పటికే డిస్కషన్స్ లో ఉన్నారని.. దాదాపుగా ప్రాజెక్టు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. మరి ఒక ఫ్లాప్ హీరో.. మూడు ఫ్లాప్ ల డైరెక్టర్ కలిసి సక్సెస్ కోసం చేసే ప్రయత్నం ఏ మాత్రం సక్సెస్ అవుతుందో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News