ఎనర్జిటిక్ హీరో.. కొత్త లుక్స్ సూపరేహా

Update: 2016-12-30 10:00 GMT
యంగ్ హీరో రామ్ నేను శైలజతో హిట్ అందుకుని..ట్రాక్ లోకి వచ్చాడని అనుకుంటే.. హైపర్ మూవీ ఫ్లాప్ తర్వాత బాగా సైలెంట్ అయిపోయాడు. మరీ ఒక సినిమా ఫ్లాప్ తోనే అసలు కనిపించడం మానేసేంతటి విషయం ఏముందబ్బా అనే ప్రశ్నలు తలెత్తాయి కానీ.. కొత్త గెటప్ ట్రై చేయడం కోసం.. ఉద్దేశ్యపూర్వకంగానే మీడియాకు దూరంగా ఉంటున్నాడనే విషయం తర్వాత బయటకు వచ్చింది.

ఈ మధ్య కొన్ని చోట్ల గుబురుగా పెంచిన గడ్డంతో కనిపించాడు కానీ.. పూర్తి లుక్ మాత్రం బయటకు రాలేదు. ఇప్పుడు ఓ నిలువుటద్దం ముందు నుంచుని సెల్ఫీ తీసుకుంటూ.. తన గెటప్ ను రివీల్ చేశాడు ఎనర్జిటిక్ హీరో. టాప్ టు బాటమ్ మొత్తం గెటప్ అంతా మార్చేసి.. సూపర్ కూల్ లోకి రామ్ ఛేంజ్ అయిపోయాడు. సహజంగా ఇంత గెడ్డం పెంచాక రఫ్ లుక్స్ ఇచ్చేందుకు ట్రై చేస్తారు కానీ.. రామ్ మాత్రం ట్రెండీ హెయిర్ స్టైల్ తో కూల్ లుక్ ఇచ్చేశాడు.

పైగా సిక్స్ ప్యాక్ కూడా చేయడంతో బాడీ షేపులు మారిపోయాయి. కండలు తిరిగిన దేహంతో అథ్లెటిక్ బాడీలోకి వచ్చేశాడు రామ్. ఇక మనోడి కొత్త సినిమా సంగతుల విషయానికి వస్తే.. నేను శైలజతో హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమలతో ఓ మూవీకి సైన్ చేశాడనే న్యూస్ రీసెంట్ గా బయటకు వచ్చింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News