మూవీ పుస్తకమైతే.. రాజమౌళి లైబ్రరీ

Update: 2017-10-10 17:53 GMT
దర్శకదీరుడు రాజమౌళి తీసిన సినిమాలు ఏ స్థాయిలో విజయాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తీసిన ప్రతి సినిమా ఎదో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఓటమి ఎరుగని దర్శకదీరుడి సినిమాలో నటించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ అదృష్టం ఉండాలి. జక్కన్న కథలో వారికి తగ్గట్టు పాత్ర తగ్గితే ఎవ్వరికైనా ఛాన్సులు  ఇస్తారు.

ఇక ఆయనతో సినిమాలు చెయ్యని వారు కూడా ఆయనను చాలా ఇష్టపడతారు. అటువంటి వారిలో హ్యాడ్సమ్ హీరో రామ్ ఒకరు. రాజమౌళి కి సంబందించిన ప్రతి విషయాన్ని రామ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటాడు. అయితే ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్బంగా రామ్ ట్విట్టర్ ద్వారా ఒక మంచి కామెంట్ పెట్టాడు.  ''ప్రతి పుస్తకం ఒక మూవీ అయితే.. రాజమౌళి రాసే ప్రతి పుస్తకం ఒక లైబ్రరీ లాంటిది'' అని చెబుతూ.. రాజమౌళి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు రామ్. అదే విధంగా మీరు మాతో ఉన్నందుకు ఎంతో గర్వంగా ఉందని కూడా రామ్ కామెంట్ చేశాడు.

బహుశా ఈ సోమవారం రాజమౌళికి లభించిన మాంచి మాంచి కాంప్లిమెంట్లలో ఇది కూడా ఒకటి అనే చెప్పొచ్చు. చూస్తుంటో హీరో రామ్ లో ఒక మంచి రచయిత కూడా ఉన్నాడనే అనుకోవాల్సిందే.




Tags:    

Similar News