సిద్దూ చెప్పేది ఓమారు వినుకోండి

Update: 2018-04-09 14:01 GMT
ఇప్పటిదాకా ఫారిన్ అంటే మన తెలుగు సినిమాలు మహా అయితే అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా లో విడుదల అయ్యేవి. కానీ బాలీవుడ్ మాత్రం ఒక మెట్టు ఎక్కువ అన్నట్టు చైనా లో కూడా సినిమాలు విడుదల చేసేస్తోంది. ఆమీర్ ఖాన్ సినిమాలకు చైనాలో విపరీతమైన క్రేజ్ ఉంది. దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్, పీకే లాంటి సినిమాలు అక్కడ కాసులవర్షం కురిపించాయి. అలానే సౌత్ ఇండస్ట్రీ కుడా పైకి రావాలి అంటూ సిద్ధార్థ్ గొంతెత్తుతున్నాడు.

బొమ్మరిల్లు లాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన ఈ చాక్లెట్ బోయ్ మొన్ననే గృహం అనే హారర్ సినిమాతో మళ్ళీ మనల్ని పలకరించాడు. ఇప్పుడు కేవలం సోషల్ మీడియాకే పరిమితమయ్యాడు. బాలీవుడ్ లో ఇర్ఫాన్ ఖాన్ నటించిన హిందీ మీడియం సినిమా ఇప్పుడు చైనా లో విడుదలకు ముస్తాబవుతోంది అని తెలిసిన వెంటనే ట్విట్టర్లో తన ఒపీనియన్ చెప్పాడు సిద్ధు. "ఇది నిజంగా చాలా గొప్ప వార్త. కానీ ఇప్పటికైనా సౌత్ ఇండియన్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను పలకరించాలి. లేదా మళ్ళీ ఇండియన్ సినిమాని బాలీవుడ్ హైజాక్ చేసేస్తుంది. ఇండియా మొత్తంలో ప్రస్తుతం చైనా కేవలం ముంబై కి మాత్రమే పట్టం కట్టాల్సిన అవసరం లేదు" అంటూ ట్వీట్ చేశాడు.

సిద్ధు చెప్పినదాన్లో నిజం ఉన్నా తెలుగు దర్శకనిర్మాతలు కూడా ఏమి తక్కువ తినలేదు. తెలుగు సినిమా అయిన బాహుబలి ఇప్పటికే జపాన్ లో విడుదల అయింది. రంగస్థలం సినిమాలో అమెరికాలో కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఇకపై కూడా మన తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకుంటాయి అని ఆశిద్దాం.
Tags:    

Similar News