కోలీవుడ్ ట్రిపుల్ శ్రీమంతుడు సూర్య

Update: 2015-12-15 07:52 GMT
వరదలయితే తగ్గాయి కానీ.. ఆ ప్రభావం నుంచి మాత్రం ఇంకా కోలుకోలేదు. ముఖ్యంగా చెన్నై - ఆ నగర చుట్టుపక్కల ప్రాంతాలు ఇంకా సమస్యలతో కొట్టుమిట్టాడుతూనే ఉన్నాయి. లక్షలాది మంది బాధితులు కంట నీరు పెడుతూనే ఉన్నారు. వీరిని ఆదుకునేందుకు రీల్ హీరోలు - హీరోయిన్లు బాగానే తరలివచ్చారు. వీలైనంతగా సాయం చేస్తున్నారు.

కొంతమంది కోట్లిచ్చారు, మరికొంత మంది ఆశ్రయం ఇచ్చారు, ఇంకొందరు అన్నం పెట్టి ఆదుకున్నారు, మరికొంతమందైతే అండగా నిలబడ్డారు. వీరందరి కంటే విభిన్నమైన రూట్ ని ఎంచుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. ఏకంగా మూడు గ్రామాలను దత్తత తీసుకున్నాడు. తిరువళ్లూర్ జిల్లాలో నెల్వర్ - కచూర్ - కేరగంబాక్కం గ్రామాలను దత్తత తీసుకుంటున్నాడు సూర్య. ఈ గ్రామాల్లోని ప్రజలు సర్వం పోగొట్టుకున్నారు. చివరికి ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డులు కూడా మిగల్లేదు. దీంతో వారు ప్రభుత్వం ఇచ్చే సహాయం అందక నరకయాతన పడుతున్నారు. ఈ పరిస్థితి తెలుసుకున్న సూర్య.. ఆ గ్రామాలను ఆదుకునేందుకు తానున్నానంటూ ముందుకొచ్చాడు.

తన అగరం ఫౌండేషన్ ద్వారా ఈ మూడు గ్రామాల ప్రజలకు వీలైనంత సాయం చేస్తున్నాడు. సహాయం చేసేందుకు సూర్య ఎంచుకున్న రూట్ పై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థాయి ఉన్నవారంతా ఇలా ఇలా కొన్ని ప్రాంతాలను దత్తత తీసుకుంటే.. త్వరగానే బాధితులు కోలుకుంటారని చెబ్తున్నారు.
Tags:    

Similar News