#నీట్ గొడ‌వ‌లో హీరో సూర్యకు మాజీ జ‌డ్జీల నుంచి మ‌ద్ధ‌తు

Update: 2020-09-15 07:10 GMT
నీట్ పరీక్షకు హాజరైన ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్యతో సౌత్ స్టార్ హీరో సూర్య‌ తీవ్ర మనస్తాపానికి గురయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్యలు న్యాయ‌(లా) వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపాయి. ఈ పరీక్షను నిర్వహించడానికి అనుమతి ఇచ్చినందుకు సుప్రీం కోర్టులో తప్పుగా చూపెడుతూ లేఖ రాయ‌డం వివాదాస్ప‌ద‌మైంది.

దీనిని వ్య‌తిరేకిస్తూ .. మద్రాస్ హైకోర్టు లాయ‌ర్ ఒక‌రు క్రిమినల్ ధిక్కారంగా సుమోటో స్వీక‌రించాల‌ని నివేదించ‌డం సంచ‌ల‌న‌మైంది. ఆ మేర‌కు ఆయన ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. విద్యార్థులకు పరీక్షల‌కు బౌతికంగా హాజ‌ర‌వ్వాలా? అయితే  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులు పనిచేయ‌డం స‌రైన‌దేనా? అన్న‌ది సూర్య అడిగిన  ప్ర‌శ్న‌. అయితే ఇక్క‌డ సూర్య వ్యాఖ్యానాన్ని స‌మ‌ర్థించేవాళ్లు లేక‌పోలేదు. ప్ర‌స్తుతం #TNstandswithSuriya సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.

కోలీవుడ్ త‌ర‌పున సూర్య‌కు మ‌ద్ధ‌తుగా నిలుస్తూ.. మద్రాస్ హైకోర్టు ఆరుగురు మాజీ న్యాయమూర్తులు ఎలాంటి చర్యలు తీసుకోవ‌ద్ద‌ని కోర్టును కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. కానీ తమిళనాడు అడ్వకేట్స్ అసోసియేషన్ (టిఎన్ఎఎ) దీనిని వ్య‌తిరేకిస్తోంది. సూర్య లేఖ `ద్వేషపూరిత ప్రసంగం`లా ఉంద‌ని ఆ ప్ర‌క‌ట‌న‌ను ఉపసంహరించుకోవాలని అంటున్నారు. మ‌రి ఈ గొడ‌వ నుంచి సూర్య ఎలా బ‌య‌ట‌ప‌డతారు? అన్న‌ది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్.
Tags:    

Similar News