చాలా మంది స్టార్ హీరోలు దర్శకులుగానూ రాణించాలని ప్రయత్నాలు చేశారు. అప్పట్లో స్వర్గీయ తారక రామారావు, సూపర్ స్టార్ కృష్ణ హీరోగానూ, దర్శకుడిగానూ, రెండు శాఖల్లోనూ సక్సెస్ అయ్యారు. తమదైన మార్కుని సృష్టించిన ప్రశంసల్ని సొంతం చేసుకున్నారు. ఇదే తరహాలో రెండు శాఖల్లోనూ తమ సత్తా చాటుకోవాలని కొంత మంది స్టార్స్ ప్రయత్నాలు చేయాలని అనుకున్నారు. కొంత మంది ఇప్పటికే చేసి ఫ్లాప్ అయ్యారు. కానీ ఓ హీరో మాత్రం రెండు శాఖల్లోనూ హీరోగా, దర్శకుడిగా వండర్స్ క్రియేట్ చేస్తున్నాడు.
తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డైరెక్టర్ గా చేసిన తొలి ప్రయత్నం 'జానీ'. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అత్యంత భారీ స్థాయిలో పవన్ నటించి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆశించిన విషయాన్ని అందించకపోగా పవన్ కు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఆ తరువాత పవన్ మరోసారి డైరెక్షన్ జోలికి వెళ్లలేదు. వెళ్లాలని అనుకోవడం లేదు. ఇక డైరెక్షన్ డిపార్ట్ మెంట్ నుంచి హీరోలుగా మారిన రవితేజ, నేచురల్ స్టార్ నాని వంటి హీరోలు డైరెక్షన్ వైపు అడుగులు వేయడానికి ఇష్టపడటం లేదు.
కెరీర్ చివరి దశలో డైరెక్షన్ సైడ్ వెళతామని అంటున్నారు. ఇదిలా వుంటే మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రం హీరోగా వరుస హిట్ లని సొంతం చేసుకుంటూనే దర్శకుడిగా కూడా తన సత్తా చాటుకుంటున్నారు. చాలా కాలంగా దర్శకుడిగా ప్రయత్నాలు చేసిన హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ అనేక అవాంతరాల తరువాత 'లూసీఫర్' మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి తొలి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు.
ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించారు. 30 కోట్లతో నిర్మించిన ఈ మూవీ 175 కోట్లని రాబట్టి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురిచేసింది. ఇప్పుడు ఇదే మూవీని మెగాస్టార్ చిరంజీవితో తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మోహన్ రాజా ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవల మోహన్ లాల్ తో చేసిన 'బ్రో డాడీ' కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో మలయాళ ఇండస్ట్రీలో ఇప్పడు పృథ్వీరాజ్ సుకుమారన్ హాట్ టాపిక్ గా మారిపోయారు.
ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా ఐదు భాషల్లో 'టైసన్' మూవీని చేస్తున్నారు. డైరెక్షన్ చేస్తూనే ఇందులో హీరోగా ఐఏఎస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు పృథ్వీరాజ్. ఇతర స్టార్ డైరెక్టర్ల సినిమాల్లో నటిస్తూనే దర్శకుడిగా తన ప్రయాణాన్ని సాగిస్తున్నారు.
త్వరలో మోహన్ లాల్ తో 'లూసీఫర్' సీక్వెల్ ని 'ఎల్ ఎస్ : ఎంపూరన్' పేరుతో తెరపైకి తీసుకురాబోతున్నాడు. ఇలా రెండు శాఖల్లోనూ వి.యవంతంగా తన సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతూ పలువురు హీరోలకు రోల్ మోడల్ గా నిలుస్తున్నాడు. తెలుగులో ప్రభాస్ నటిస్తున్న 'సలార్'లో ఓ కీలక పాత్రలో పృథ్వీరాజ్ నటిస్తున్న విషయం తెలిసిందే.