విలక్షణ నటుడు, స్టార్ హీరో విక్రమ్ తనదైన నటనతో తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. అంతే కాకుండా తన డబ్బింగ్ సినిమాలతో ఉత్తరాదిలోనూ భారీ అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం దిగ్రేట్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్న చారిత్రక చిత్రం `పొన్నియిన్ సెల్వన్`లో నటిస్తున్నారు. ఆదిత్య కరికాళన్ గా విక్రమ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈమూవీని లైకా ప్రొడక్షన్స్ తో కలిసి మద్రాస్ టాకీస్ నిర్మిస్తోంది.
దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ ని శుక్రవారం సాయంత్రం చెన్నైలో విడుదల చేశారు. ఈ కార్యక్రమాలనికి ముందు శుక్రవారం మధ్యాహ్నం విక్రమ్ హార్ట్ ఎటాక్ కారణంగా కావేరీ హస్పిటల్ లో చేరారంటూ వార్తలు మొదలయ్యాయి. దీంతో విక్రమ్ అభిమానులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విక్రమ్ క్షేమంగా వుండాలని, ఆరోగ్యంగా బయటికి రావాలని ప్రార్థనలు చేశారు. నెట్టింట జోరుగా ట్వీట్ లు చేశారు.
అయితే విక్రమ్ హార్ట్ ఎటాక్ కి గురి కాలేదని, స్వల్ప చాతి నొప్పి కారణంగానే విక్రమ్ హాస్పిటల్ లో చేరారని, ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రత్యేక డాక్టర్ల బృందం ఆయనకు ప్రత్యేక చికిత్సని అందిస్తున్నారని, త్వరలోనే విక్రమ్ డిశ్చార్జ్ అవుతారని కావేరీ హాస్పిటల్ సిబ్బంది హెల్త్ బులిటిన్ ని విడుదల చేసింది. ఆ వెంటనే విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హార్ట్ ఎటాక్ వార్తలపై మండిపడ్డారు. అసత్య ప్రచారాలు చేయకండి అంటూ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేశారు.
అయితే శనివారం సాయంత్రం విక్రమ్ క్షేమంగా కావేరి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలియజేస్తూ విక్రమ్ ఫ్యాన్స్ ని ఉద్దేశించిన ఓ వీడియో నెట్టింట్లో సందడి చేస్తోంది. అయితే ఇది తాజా వీడియో కాదని, ఓల్డ్ వీడియోని ఫ్యాన్స్ కావాలనే నెట్టింట ట్రెండ్ చేస్తున్నారని తెలిసింది. అంటే హీరో విక్రమ్ కావెరీ హాస్పిటల్ నుంచి ఇంకా డిశ్చార్జ్ కాలేదని, ఆయనకు ప్రస్తుతం ప్రత్యేక డాక్టర్ల బృందం చికిత్స అందిస్తోంది, విక్రమ్ త్వరలోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారని తెలుస్తోంది. ఈ విషయం తెలుసిన కొంత మంది అభిమానులు విక్రమ్ క్షేమంగా హాస్పిటల్ నుంచి తిరిగి రావాలని, త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారట.