కింగ్‌ఖాన్ షారూక్ నటించిన `జీరో` చిత్రంతో పోటీపడుతూ కన్నడ సినిమా `కెజిఎఫ్` రికార్డులు తిరగరాయడంపై ప్రస్తుతం అన్ని మీడియాల్లో సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. `జీరో` వసూళ్లను మించి కెజిఎఫ్ వసూలు చేయడం పై యశ్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో వార్ కి తెర తీశారు. దీంతో షారూక్ అభిమానులు తిరిగి యశ్ అభిమానులకు కౌంటర్లు ఇవ్వడం పైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఫ్యాన్స్ వార్ రచ్చ ఎలా ఉన్నా.. తన సినిమా కెజిఎఫ్ కింగ్ ఖాన్ సినిమాకే ఎసరు పెట్టడం పై ప్రశ్నించిన మీడియాకు యశ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
``ఈ శుక్రవారం ఒకరిది.. వచ్చే శుక్రవారం ఇంకొకరిది.. సినిమాలో కంటెంట్ మాత్రమే డ్రైవ్ చేస్తుంది. కొత్త హీరో అయినా సత్తా చాటే ఛాన్సుంద``ని అన్నారు యశ్. అయితే షారూక్ ఖాన్ సినిమాతో పోలిక పెట్టడం సరికాదని అన్నారు. షారూక్ నటించిన జీరో- కెజిఎఫ్ రెండు సినిమాలు పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. అలాగే తమ సినిమాల్ని పోల్చడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. షారూక్ నటించిన జీరో తొలి మూడు రోజుల్లో 49 కోట్లు వసూలు చేస్తే అంతకుమించి కెజిఎఫ్ వసూలు చేసింది. అలాగే కేవలం హిందీ బాక్సాఫీస్ నుంచి కెజిఎఫ్ ఏకంగా 17 కోట్లు కొల్లగొట్టడం పైనా ఉత్తరాదిన ఆసక్తికర చర్చ సాగుతోంది.
తాను ఎవరికీ తెలియకపోయినా .. అటు ఉత్తరాదినా ఆడియెన్ బ్రహ్మరథం పట్టడం పై ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. కన్నడ సినిమా నెక్ట్స్ లెవల్ కి వెళుతోంది. తర్వాతి స్థాయికి తీసుకెళ్లడం నా బాధ్యత అని అన్నారు. అయితే సినిమా రంగంలో ప్రతి శుక్రవారం గేమ్ ఛేంజ్ అవుతుందని యశ్ వ్యాఖ్యానించడం విశేషం. మొత్తానికి డ్రైవర్ కొడుకు ఫుల్ క్లారిటీ తో ఉన్నాడని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా అతడిలో స్పోర్టింగ్ స్పిరిట్.. పోటీ పడే తత్వం, వినయం ఆకట్టుకుంటున్నాయని టాలీవుడ్ మీడియా సైతం ప్రశంసిస్తోంది.