ఆయన్ని డైరెక్ట్ గా చూడాలంటే భయం వేసేది

Update: 2022-10-26 02:30 GMT
టాలీవుడ్‌ స్టార్స్ లో మోహన్‌ బాబు కి ప్రత్యేకమైన శైలి మరియు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది అనడంలో సందేహం లేదు. ఆయన కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోలతో పోటీ పడి మరి సినిమాలు చేసేవాడు.. సక్సెస్ లు దక్కించుకునే వాడు. క్రమశిక్షణ కి మారు పేరు అన్నట్లుగా ఆయన ఉంటాడు అంటూ అంతా కూడా అంటూ ఉంటారు.

ఆయనతో షూటింగ్ అంటే కాస్త టెన్షన్ ఉంటుంది. షాట్ సరిగా రాకుంటే తిడతాడు.. అనుకున్న విధంగా నటించకుంటే తిడతాడు.. సెట్‌ లో కాస్త జోవియల్ గా ఉన్నా కూడా కోపంగా చూస్తాడు అంటూ చాలా మంది మోహన్‌ బాబు గురించి మాట్లాడుకోవడం మనం చూశాం. తాజాగా సీనియర్ హీరోయిన్‌ ప్రేమ కూడా మోహన్‌ బాబు గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

హీరోయిన్‌ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన ప్రేమ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఎట్టకేలకు ఈమె అనుకోని ప్రయాణం అనే సినిమా తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అక్టోబర్‌ 28న విడుదల కాబోతున్న ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ప్రేమ మాట్లాడుతూ మోహన్‌ బాబు పై వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ఆమె మాట్లాడుతూ.. తెలుగు లో నాకు రామానాయుడు గారు ధర్మ చక్రం సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత మోహన్‌ బాబు గారితో రాయలసీమ రామన్న చౌదరి సినిమాలో నటించాను. ఆ సినిమా లో నటించే సమయంలో చాలా భయపడ్డాను. మోహన్‌ బాబు గారి గురించి అంతకు ముందు చాలా విషయాలు విని ఆయనతో నటించేందుకు భయపడ్డాను.

మోహన్‌ బాబు గారితో నటించడమే కష్టం అంటే.. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం అనేది చాలా కష్టంగా మారింది. ఆయన్ని డైరెక్ట్ గా చూడాలంటే భయం వేసేది. అయినా కూడా షూటింగ్‌ సమయంలో మోహన్‌ బాబు గారి కి పోటీగా నటించానంటూ అప్పటి విషయాలను చెప్పుకొచ్చింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News