రెమ్యునరేషన్ ప్రతాపం అంతా సౌత్ లోనే!

Update: 2018-08-29 01:30 GMT
తెలుగులో హీరోయిన్స్ లేరా? ఉన్నారు. తెలుగు మాట్లాడే అచ్చ తెలుగు హీరోయిన్లు ఉన్నారా? ఏమో ఎవరికీ తెలుసు?  ఉంటారు గానీ టాప్ హీరోల సినిమాలకు వాళ్ళని కన్సిడర్ చెయ్యరు. ఎదో అమావాస్యకు పౌర్ణమికి ఈషా రెబ్బా లాంటి 'ఫైటర్స్' మేమేం తక్కువకాదు అంటూ పోరాడతారు.  కానీ మనోళ్ళకు హిందీ బెల్ట్ నుండి వచ్చి పాలిష్ద్ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు అంటే ఏదో అయిపోతుంది.  వాళ్ళకు యాక్టింగ్ రావాలనే రూల్ లేదు.  లిప్ సింక్ ఇవ్వగలరా లేదా అనే టెన్షన్ ఉండదు.  కనీసం హీరో ఏ ఎమోషన్ లో మాట్లాడుతున్నాడో కూడా ప్రాంప్టింగ్ ఇచ్చేవాళ్ళు నాలుగుసార్లు వివరిస్తేగానీ అర్థం కాదు..  అయినా వాళ్ళే కావాలి.  వాళ్ళకు రెమ్యునరేషన్ కూడా కోట్లలో ఉంటుంది.

మరి అదే ఈ బ్యూటీలు ముంబై కి వెళ్తే ఏమౌతుంది?  అక్కడ అవకాశం ఇస్తారో లేదో తెలీదు గానీ ఇస్తే మాత్రం రెమ్యునరేషన్ మాత్రం ఇక్కడ ఇచ్చేదాన్లో సగమే ఇస్తారట.  ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చి టాప్ హీరోల సరసన నటించిన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కు తెలుగులో కోటి వరకూ రెమ్యూనరేషన్ ఇచ్చేవారట.  కానీ బాలీవుడ్ లో మాత్రం రూ. 45 నుండి 50 లక్షలు  మాత్రమే ఇస్తారట.  ఈ విషయాన్ని ఒక బాలీవుడ్ ఫిలిం మేకర్ వెల్లడించాడు.

మరి బాలీవుడ్లో తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినా ఎందుకు అక్కడ సినిమా చేసేందుకు రెడీ అవుతారు?  నేషన్ వైడ్ పాపులారిటీ  ఒక కారణం అయితే మరో కారణం బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ అట!
Tags:    

Similar News