తెలుగులో సీనియర్ అగ్రహీరోలు ఆ నలుగురు కాకుండా.. ఓ పది మందికి పైగా స్టార్డం ఉన్న హీరోలు ఉన్నారు. హీరోలు ఇంత మంది ఉన్నా.. హీరోయిన్లు తక్కువ మంది ఉండడంతో నిర్మాతలకు, దర్శకులకు పెద్ద తలనొప్పిగా మారింది. హీరోల డేట్లు చేతిలో ఉన్నా హీరోయిన్లు మాత్రం దొరకడం లేదు. అందరు హీరోలు పూజా హెగ్డే, రష్మిక మందన్న, కీర్తి సురేష్, సాయి పల్లవి వంటి వారినే కోరుకుంటున్నారు. ఆ హీరోయిన్లందరూ తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళ సినిమాల్లో నటిస్తుండటంతో వారి డేట్స్ దొరకడం కష్టంగా మారింది. కియారా అద్వానీ మొదట్లో తెలుగు సినిమాలు వరుసగా చేసినా.. ఆమె ప్రస్తుతం హిందీ సినిమాలకే పరిమితం కావడంతో అందుబాటులో ఉండటం లేదు. సాయి పల్లవి అందరికీ ఆప్షనే అయినా ఆమె మాత్రం వచ్చిన అవకాశాలన్నీ ఒప్పుకోవడం లేదు. ఆచితూచి తనకు నచ్చిన సినిమాలు మాత్రమే ఒప్పు కుంటున్నారు.
నిధి అగర్వాల్, సభా నటేష్ గత ఏడాది ఇస్మార్ట్ శంకర్ తో విజయం అందుకున్నా వారిని ఎందుకు ఆఫర్లు వరించడం లేదు. రకుల్ ప్రీత్ సింగ్ ఆ మధ్య వరుసగా సినిమాలు చేసినా.. ఆ తర్వాత ఆమె తమిళ్, హిందీ సినిమాల వైపు మొగ్గు చూపడంతో తెలుగులో ప్రస్తుతం ఆమెకు ఆఫర్లు కరువయ్యాయి. అనుపమ పరమేశ్వరన్, మెహ్రీన్, లావణ్య త్రిపాఠి, నివేద థామస్, ప్రగ్యా జైస్వాల్, పాయల్ రాజ్ పుత్, అను ఇమ్మాన్యుయేల్, రాశి కన్నా, రీతూ వర్మ వంటి వారు అందుబాటులో ఉన్నా..ఫామ్ లో లేకపోవడంతో వారిని ఎంపిక చేసుకునేందుకు మేకర్స్ అంతగా ఆసక్తి చూపడం లేదు.
ప్రస్తుతం పూజ హెగ్డే ప్రభాస్ తో రాధే శ్యామ్, అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, హిందీలో కబీ ఈద్ దివాళి తదితర సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. రష్మిక అల్లు అర్జున్ తో పుష్ప, కన్నడలో 'పొగరు ' తమిళ్ లో కార్తీతో సుల్తాన్ సినిమాల్లో నటిస్తున్నారు. ఇక కీర్తి సురేష్ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం ఆమె మహేష్ బాబుతో సర్కారు వారి పాట, నితిన్ తో రంగ్ దే, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, రజనీ మూవీ 'అన్నాత్తే' లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయి పల్లవి మొదటి నుంచి సెలెక్టెడ్ సినిమాల్లో మాత్రమే నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె నాగచైతన్య తో లవ్ స్టోరీ, రానాతో విరాటపర్వం సినిమాల్లో మాత్రమే నటిస్తోంది. రిలీజ్ కు సిద్ధంగా ఉన్న వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి శెట్టి ఇప్పటికే విడుదలైన ఉప్పెన వీడియో సాంగ్స్ తో యూత్ ను ఎట్రాక్ట్ చేస్తోంది. విజయ్ దేవరకొండ ఫైటర్ తో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా పరిచయం అవుతోంది. మరి ఈ కొత్త భామల యినా విజయాన్ని అందుకొని టాలీవుడ్ కొరత తీరుస్తారేమో చూడాలి.