భరత్ లో ఆ పావు గంటే కీలకం
మహేష్ బాబు భరత్ అనే నేను కౌంట్ డౌన్ వేగంగా జరిగిపోతోంది. బహిరంగ సభ జరిగి అప్పుడే 24 గంటలు అయిపోయింది. మరో 11 రోజుల్లో ముఖ్య మంత్రిగా మహేష్ బాబు చేయబోయే రచ్చ కోసం ఫాన్స్ మాత్రమే కాదు సినిమా ప్రేమికులు కూడా ఎదురు చూస్తున్నారు. చాలా ఇంటెన్స్ గా ఉన్న ట్రైలర్ చూసాక హైప్ కూడా అమాంతం రెట్టింపు అయిపోయింది. యు ట్యూబ్ లో నెంబర్ 1 ట్రెండింగ్ లోకి కూడా వచ్చేసిన భరత్ అనే నేనులో బయటికి చెప్పని విశేషాలు ఎన్నో ఉన్నాయని ఇన్ సైడ్ టాక్. ముఖ్యంగా అసెంబ్లీ సన్నివేశాలను ఓ రేంజ్ లో కొరటాల శివ తీర్చిదిద్దినట్టు తెలిసింది. ఇవి దాదాపు 15 నిమిషాలకు పైగానే ఉంటాయని తెలిసింది. ప్రతిపక్ష నాయకులు తన మీద ఆరోపణలతో దాడి చేసినప్పుడు గణాంకాలతో సహా మహేష్ తిప్పి కొట్టే సీన్ కు విజిల్ వేయని ఆడియన్స్ ఉండరని టాక్.
కేవలం ఈ సీన్స్ కోసమే ఖరీదైన సెట్ వేయడానికి వెనుకాడలేదు నిర్మాత డివివి దానయ్య.నిన్న సభలో కొరటాల శివ చెప్పినట్టు ఎక్కడా రాజీ పడనందువల్లే చాలా క్వాలిటీ గా సినిమా వచ్చిందని వినికిడి. కీలకమైన ఈ సన్నివేశాలన్నీ సెకండ్ హాఫ్ లో ఉండబోతున్నాయి అని తెలిసింది. దేవరాజ్-ప్రకాష్ రాజ్ వీటిలో కీలక పాత్ర వహించినట్టు వినికిడి. గతంలో లీడర్ లాంటి సినిమాల్లో కూడా ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయి కాని అవి మాస్ ని మెప్పించలేక చప్పగా సాగాయి. కాని భరత్ అనే నేనులో మాత్రం మహేష్ ఇమేజ్ ప్లస్ పెర్ఫార్మన్స్ తో వీటికి పీక్స్ కు తీసుకువెళ్లినట్టు సమాచారం. ఈ మధ్యకాలంలో అసెంబ్లీ వేదికగా జరిగే రసవత్తరమైన సీన్స్ ఏ సినిమాలోనూ చూడలేదు. సో మహేష్ లాంటి స్టార్ హీరో మూవీలో అవన్నీ ఉన్నాయి అంటే పండగ కాక మరేముంటుంది.
కైరా అద్వాని గురించి కూడా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. తనతో లవ్ ట్రాక్ రెగ్యులర్ సినిమాల తరహాలో ఎక్కువ సేపు కాకుండా ఎంత అవసరమో అంత వరకే పెట్టేసి తను చెప్పాలనుకున్న మెసేజ్ ని చెప్పడం పైనే కొరటాల శివ దృష్టి పెట్టినట్టు రిపోర్ట్. రంగస్థలం కొత్త రికార్డ్స్ సెట్ చేసిన దరిమిలా వాటిని భరత్ బ్రేక్ చేస్తాడనే భరోసాతో ఉన్న మహేష్ ఫాన్స్ అంచనాలు ఎంత వరకు నిలుస్తాయో 20న తేలనుంది.