ఒకే రోజు ఒకే ముహూర్తానికి.. రెండు ఘనమైన విషయాలు వాడి వేడి చర్చకు తావివ్వబోతున్నాయి. ఆ రెండు ఘనకార్యాలు ఏంటి? అంటే.. ఒకటి 2.ఓ రికార్డులు.. రెండోది AMB సినిమాస్ గ్రాండ్ లాంచింగ్. ఇవి రెండూ తెలుగు ప్రేక్షకుల్లో వాడి వేడిగా చర్చకు తావిచ్చేవే.
ఇప్పటివరకూ ఉన్న అన్ని రికార్డుల్ని 2.ఓ బ్రేక్ చేస్తుందా? అన్న చర్చ ఎంత గొప్పగా సాగనుందో, మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ లాంచింగ్ గురించి అంతే గొప్పగా మాట్లాడుకుంటున్నారు జనం. ఈపాటికే లాంచ్ కావాల్సిన మహేష్ - ఏషియన్ సినిమాస్ మల్టీప్లెక్స్ ఓ దివ్యమైన ముహూర్తం కోసమే వేచి చూస్తోంది. ఆ ముహూర్తాన్ని ఇప్పటికే లాక్ చేశారని ఇదివరకూ చెప్పుకున్నాం. ఏఎంబీ సినిమాస్‌ని 2.ఓ రిలీజ్ రోజున సూపర్‌స్టార్ రజనీకాంత్ లాంచ్ చేయనున్నారని ప్రచారం సాగుతోంది. రజనీ నటించిన 2.ఓ షోతోనే లాంచ్ చేయాలని ఏఎంబీ సినిమాస్ అధినేతలు భావించారట. అయితే రజనీ వస్తారా లేదా? అన్నదానికి అధికారికంగా ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు.
ఇంతకీ ఏఎంబీ సినిమాస్ ప్రత్యేకత ఏంటి? అంటే.. ఈ మల్టీప్లెక్స్ హైదరాబాద్ నగరానికే కొత్త కళ తేనుందిట. నగరంలోనే అత్యంత కాస్ట్‌లీగా రిచ్ లుక్‌తో కనీవినీ ఎరుగని రీతిలో ఇంద్రభవనాన్ని తలపించే హైఫై ఆర్కిటెక్చర్ లుక్‌తో దీనిని నిర్మించారు. అది కూడా హైదరాబాద్ గుండెకాయ గచ్చిబౌళి పరిసరాల్లో ఉండడంతో జనాల కన్ను దీనిపై ఉందిప్పుడు. ఇందులో ఏకంగా 7 స్క్రీన్లు ఉన్నాయి. ఇవన్నీ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్క్రీన్ మోడల్‌లో ఉంటాయిట. ఇందులో 3డి టెక్నాలజీ ఇన్‌బిల్టెడ్. 7 స్క్రీన్లలో మొత్తం 1636 సీట్లు ఉంటాయిట. స్క్రీన్ 1లో 436 సీట్ల కెపాసిటీ, లేజర్ ప్రొజెక్షన్ సిస్టమ్ హైలైట్‌గా ఉంటాయిట. స్క్రీన్ 2లో 308 సీట్లు, స్క్రీన్ 3లో 308 సీట్లు, స్క్రీన్ 4లో 158 సీట్లు (ఇది చిన్న సైజు), అలాగే స్క్రీన్ 6లో 214 సీట్లు ఉంటాయిట. స్క్రీన్ 5 వీటన్నిటి కంటే డిఫరెంట్. ఇందులో ప్రత్యేకించి 52 వీఐపీ సీట్లు స్పెషల్‌గా డిజైన్ చేశారట.