'దొరసాని' మూవీతో హీరోగా పరిచయమైన ఆనంద్ దేవరకొండ 'మిడిల్ క్లాస్ మెలోడీస్' మూవీతో తొలి విజయాల్ని సొంతం చేసుకున్నాడు. 'పుష్పక విమానం' తరువాత ఆనంద్ దేవరకొండ నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ 'హైవే'. మానస రాధాకృష్ణ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి. గుహన్ దర్శకత్వం వహించారు.
వెంకట్ తలారి నిర్మించారు. సయామీఖేర్, అభిషేక్ బెనర్జీ, జాన్ విజయ్, రేష్మా పసుపులేటి ఇతర పాత్రల్లో నటించారు. ఆగస్టు 19 నుంచి ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ ని మంగళవారం హీరో నాగశౌర్య విడుదల చేశారు. గత కొంత కాలంగా హీరో ఆనంద్ దేవరకొండ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు పూర్తి భిన్నంగా అడుగులు వేస్తూ కొత్త తరహా సినిమాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే లేటెస్ట్ గా సైకో క్రైమ్ థ్రిల్లర్ కథతో 'హైవే' మూవీని చేశారు. ఇందులో విభిన్నమైన పాత్రలో నటించాడు. అమ్మాయిల్ని టార్గెట్ చేస్తూ అత్యంత కిరాతకంగా మర్డర్ చేసే ఓ సైకో కిల్లర్ చుట్టూ సాగే స్టోరీ ఇది.
'వరుస హత్యలతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న సైకో కిల్లర్ అనే వాయిస్ తో ట్రైలర్ మొదలైంది.. ఓ వ్యాన్ లో ఆనంద్ దేవరకొండ ఓ యువతితో.. మీరేం భయపడక్కర్లేదు రిలాక్స్ గా ఉండండి.. ఒక అమ్మాయి లైఫ్ సేవ్ చేయడానికి మీ హెల్ప్ కావాలి సార్.. తప్పుచేశామేమోరా.. అంటూ ఆనంద్ దేవరకొండ చెబుతున్న డైలాగ్ లు ఆకట్టుకుంటున్నాయి. 'సేమ్ ప్యాటర్న్ సేమ్ స్టైల్ ... ఇది వాడి సిగ్నేచర్.. నాకూ ఆ వయసు చెల్లెలే వుంది.. నేనూ అదే సమాధానం కోసం వెతుకుతున్నాను' అంటూ 'రేయ్' ఫేమ్ సాయమీ ఖేర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చెబుతున్న డైలాగ్ లు సినిమా కథ ఏంటో చెప్పేస్తున్నాయి.
హైవేపై ట్రాక్ లో వెళుతూ కనిపించిన యువతులని అత్యంత కిరాతకంగా మర్డర్ లు చేసే ఓ సైకో చుట్టూ సాగే కథ ఇది. తనని సహాయం కోరిన యువతి సైకో బారిన పడిందా? అని వెతికే పాత్రలో ఆనంద్ దేవరకొండ కనిపించగా, వరుస హత్యలని చేదిస్తూ సైకో కిల్లర్ ని వెతికే పోలీస్ ఆఫీసర్ పాత్రలో 'రేయ్' ఫేమ్ సయామీ ఖేర్ నటించింది.
'పాతాళ్ లోక్' వెబ్ సిరీస్ లో సైకో కిల్లర్ గా కనిపించిన అభిషేక్ బెనర్జీ ఇందులోనూ అదే తరహా పాత్రలో నటించి భయపెట్టాడు. '118' అనే థ్రిల్లర్ తో దర్శకుడిగా పరిచయమైన కె.వి. గుహన్ ఈ మూవీని ఆద్యంతం సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలతో ఆత్యంతం ఉత్కంఠభరితంగా తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 19 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇతర పాత్రల్లో జాన్ విజయ్, రేష్మా పసుపులేటి, సత్య తదితరులు నటించారు.
Full View