మెగా పవర్ స్టార్ రాంచరణ్ పుట్టినరోజు సందర్బంగా ఎన్టీఆర్ నిన్న ఏదో స్పెషల్ వీడియోని గిఫ్ట్ గా ఇవ్వనున్నట్లు ప్రామిస్ చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ వీడియో చూడటానికి అభిమానులంతా ట్విట్టర్ లో కళ్లుకాయలు కాచేలా ఉదయం పది గంటల వరకు ఎదురు చూసారు. కానీ అభిమానులతో పాటు రాంచరణ్ కి కూడా నిరాశే మిగిలింది. ఆ వీడియో గురించి రాంచరణ్ ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్ ని అడిగితే..
'సారీ బ్రదర్.. నేను ఆ వీడియోని నిన్న రాత్రే రాజమౌళికి పంపించాను. ఆయన ఒపీనియన్ కోసమని.. తెలుసు కదా.. రాజమౌళి గారి సంగతి.. కొంచం లేట్ అవుతుంది కావచ్చు..' అంటూ ఎన్టీఆర్ రిప్లై ఇచ్చాడు. ఇక ఆ వీడియో కోసం మెగాస్టార్ చిరంజీవి కూడా ఆత్రంగా ఎదురుచూస్తూ "ఆ వీడియో ఏది?" అంటూ అడిగాడు. మెగాస్టార్ కూడా స్పందించడం తో రాజమౌళి రంగంలోకి దిగి.. 'సార్.. ఆ వీడియో.. కొంచమే.. ప్లీజ్ సార్' అంటూ జవాబిచ్చాడు. అంతే ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఎదురుచూపులకు తెరపడినట్లు అయింది. జక్కన్న కదా ఎంతైనా.. ఇంకా చెక్కుతున్నాడేమో అంటూ సోషల్ మీడియా లో వీళ్ళ సంభాషణలు హల్చల్ చేస్తున్నాయి.